Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
డీసీఎంను ఢీకొట్టిన టూరిస్ట్ బస్సు.. ఒకరు దుర్మరణం

డీసీఎంను ఢీకొట్టిన టూరిస్ట్ బస్సు.. ఒకరు దుర్మరణం

వార్త 2 months ago

Dornala Road Accident: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా దోర్నాల సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. గుజరాత్‌కు చెందిన యాత్రికులతో వెళ్తున్న టూరిస్ట్ బస్సు, రోడ్డు పక్కన నిలిపి ఉంచిన డీసీఎం వాహనాన్ని బలంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

Read Also : Hanumakonda Crime: స్విమ్మింగ్ పూల్‌లో తల్లీ, ఇద్దరు కూతుళ్ల అనుమానాస్పద మృతి

 Dornala Road Accident: Tourist bus hits DCM.. one person dies

Dornala Road Accident: శ్రీశైలం వెళ్తుండగా విషాదం

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుజరాత్ రాష్ట్రానికి చెందిన సుమారు 40 మంది యాత్రికులు విజయవాడ నుంచి శ్రీశైలం దర్శనానికి బయలుదేరారు. ఈ క్రమంలో దోర్నాల సమీపంలోకి రాగానే, టైర్ పంచర్ కావడంతో రోడ్డు పక్కన ఆపి ఉన్న డీసీఎంను బస్సు వేగంగా ఢీకొట్టింది. ప్రమాద సమయంలో ప్రయాణికులందరూ గాఢ నిద్రలో ఉండటంతో ఒక్కసారిగా హాహాకారాలు మిన్నంటాయి.

సహాయక చర్యలు

సమాచారం అందుకున్న వెంటనే దోర్నాల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మృతుడి వివరాలు సేకరిస్తున్నారు. మిగిలిన ప్రయాణికులను సురక్షిత ప్రాంతానికి తరలించి, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

నమ్మించి పిలిచి.. కన్నకూతురినే కాటికి పంపిన కర్కశత్వం!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha