AP disabled welfare schemes:దివ్యాంగుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా జారీ చేస్తున్న యూడీఐడీ కార్డు దేశవ్యాప్తంగా ఎంతో ముఖ్యమైన గుర్తింపు పత్రంగా పనిచేస్తుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సదరం ధ్రువపత్రం కలిగిన ప్రతి దివ్యాంగుడు ఈ ప్రత్యేక జాతీయ గుర్తింపు కార్డు కోసం ఆన్లైన్లో సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ పథకాలు, విద్యావకాశాలు అలాగే ఉద్యోగ రిజర్వేషన్ల ప్రయోజనాలు పొందడానికి ఈ కార్డు కచ్చితంగా అవసరం అవుతుంది. ఎలాంటి రుసుము లేకుండా ఉచితంగా లభించే ఈ పత్రం రెండు వారాల్లోనే అందుబాటులోకి వస్తుంది.
Read also: Dr Priyanka Funeral: డాక్టర్‌గా ఎదిగి అనంత లోకాలకు..ఏక్లాస్‌పూర్‌లో అంత్యక్రియలు
Benefits of the UDID card
యూడీఐడీ ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ
ఈ ప్రత్యేక గుర్తింపు కార్డు కోసం అధికారిక వెబ్సైట్ అయిన స్వవలంబన్ కార్డ్ పోర్టల్ ద్వారా దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయవచ్చు. ఆధార్ కార్డుతో పాటు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన సదరం ధ్రువపత్రం వివరాలను నమోదు చేసి 21 రకాల వైకల్యా కేటగిరీలలో సరైన ఆప్షన్ ఎంచుకోవాలి. అప్లికేషన్ పూర్తి చేసిన తర్వాత సమీపంలోని జిల్లా కేంద్ర ఆస్పత్రిని ఎంపిక చేసుకోవాలి. ఆస్పత్రిలోని హెల్ప్ డెస్క్ పరిశీలన అనంతరం రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కు ధృవీకరణ సందేశం వస్తుంది. ఆన్లైన్ ద్వారా నేరుగా ఈ కార్డును డౌన్లోడ్ చేసుకునే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది.
AP disabled welfare schemes:దివ్యాంగులకు లభించే ముఖ్య ప్రయోజనాలు
జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్ అలాగే జేఈఈ ప్రవేశ పరీక్షల కౌన్సిలింగ్ సమయంలో ఈ కార్డు తప్పనిసరిగా సమర్పించాలి. కేంద్ర ప్రభుత్వం అందించే వివిధ రకాల స్కాలర్షిప్ లు పొందడానికి అలాగే ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్ కోటాకు ఇది చాలా ముఖ్యం. రైల్వే ప్రయాణాలలో లభించే రాయితీలు పొందాలన్నా ఈ జాతీయ గుర్తింపు పత్రం ఉండాలి. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ సులభమైన విధానాన్ని ఉపయోగించుకుని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
Epaper: epaper.vaartha.com

