Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
డ్రగ్స్ నిర్మూలనకు 'ఈగల్ వెబ్సైట్‌' విశేష కృషి

డ్రగ్స్ నిర్మూలనకు 'ఈగల్ వెబ్సైట్‌' విశేష కృషి

వార్త 2 months ago

డ్రగ్స్ కట్టడిలో ఈగల్ వెబ్ సైట్ ను ప్రారంభించిన డిజిపి శివధర్రెడ్డి

Drug Control: రాష్ట్రంలో మాదకద్రవ్యాల నిర్మూలనకు ఏర్పాటైన ఈగల్ (పూర్వపు టి.నాబ్) వెబ్ సైట్ ను డిజిపి శివధర్రెడ్డి మంగళవారం ప్రారంభించారు.

డిజిపి కార్యాలయంలో జరిగిన ఈ వెబ్సైట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఈగల్ డైరెక్టర్ సందీప్ శాండిల్యాతో పాటు సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్, కమాండ్ కంట్రోల్ ఇన్ఛార్జి కమలాసన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిజిపి శివధర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో డ్రగ్స్ కట్టడికి ఈగల్ పోలీసులు విశేషంగా కృషి చేస్తున్నారని కొనియాడారు.

Read Also: Narayanpet crime: నారాయణపేటలో దారుణం.. చెరువుగట్టున నాలుగేళ్ల చిన్నారి మృతదేహం

 DGP Shivdhar Reddy launches Eagle website

Drug Control: వెబ్సైట్ ద్వారా బాధితులకు భరోసా

కొత్తగా ఏర్పాటైన ఈగల్ వెబ్సైట్ లో అనేక అంశాలు వున్నాయని, వీటివల్ల మాదకద్రవ్యాలకు సంబంధించి సమాచారం ఇవ్వదలచుకున్న వారు దీనిని వినియోగించుకునే వీలుందని ఆయన తెలిపారు. దీంతో పాటు బాధితులు నేరుగా తమ ఫిర్యాదులు చేయవచ్చని, మాదకద్రవ్యాల బాధితుల కోసం వున్న పునరావాస కేంద్రాల వివరాలు ఇందులో వున్నాయని, వీటిని అందరు పరిశీలించుకోవచ్చని డిజిపి తెలిపారు. డ్రగ్స్ కట్టడికి ఈగల్ విభాగం చేబడుతున్న కార్యక్రమాలు ఈ వెబ్సైట్లో వుంటాయని తెలిపారు.

మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యం

ఈగల్ డైరక్టర్ సందీప్ శాండిల్యా మాట్లాడుతూ డ్రగ్స్ కట్టడికి తమ విభాగం చేస్తున్న కృషికి పోలీసుల సహకారం ఎంతో అండగా వుందని తెలిపారు. రాష్ట్రంలో మాదకవ్యాలను సమూలంగా నిర్మూలించాలనే సర్కారు సంకల్పాన్ని ఈగల్ కచ్చితంగా నెరవేరుస్తుందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో విజిలెన్స్ ఎన్ఫోర్స్ మెంట్ డిఐజి అభిషేక్ మొహంతి, ఎస్పి రఘువీర్ తదితరులు పాల్గొన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

జాబ్ క్యాలెండర్‌పై కవిత నిలదీత.. 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha