Dailyhunt
నారాయణపేటలో దారుణం.. చెరువుగట్టున నాలుగేళ్ల చిన్నారి మృతదేహం

నారాయణపేటలో దారుణం.. చెరువుగట్టున నాలుగేళ్ల చిన్నారి మృతదేహం

వార్త 2 weeks ago

Narayanpet crime: నారాయణపేట జిల్లాలోని అమ్మిరెడ్డిపల్లి గ్రామంలో గుండెల్ని పిండేసే విషాదకర ఘటన వెలుగుచూసింది. కేవలం కొన్ని గ్రాముల బంగారం, వెండి నగలకు ఆశపడి కిరాతకులు ఒక ఐదేళ్ల అభం శుభం తెలియని చిన్నారిని పొట్టనబెట్టుకున్నారు.

ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపడమే కాకుండా, గ్రామస్థులను భయాందోళనలకు గురిచేస్తోంది.

Read also: Ganderbal Encounter: జమ్మూకాశ్మీర్ గందర్‌బల్‌లో ఎన్‌కౌంటర్.. అడవిలో నక్కిన ఉగ్రవాది హతం

 Narayanpet crime: Atrocity in Narayanpet.. Body of a four-year-old child found near a pond

Narayanpet crime: ఏం జరిగిందంటే?

స్థానిక సమాచారం ప్రకారం, అమ్మిరెడ్డిపల్లికి చెందిన తేజశ్రీ (5) అనే బాలిక అకస్మాత్తుగా కనిపించకుండా పోయింది. కుటుంబ సభ్యులు గాలించగా, ఇంటి సమీపంలోని చెరువు కట్టపై బాలిక నిర్జీవంగా పడి ఉండటం కనిపించింది. గుర్తు తెలియని దుండగులు బాలికను అపహరించి, నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయ్యింది.

నగల కోసమే హత్య?

ఈ ఘాతుకానికి ప్రధాన కారణం నగలేనని అనుమానిస్తున్నారు. బాలిక ఒంటిపై ఉన్న బంగారు మరియు వెండి ఆభరణాలు కనిపించకుండా పోవడంతో, కేవలం దొంగతనం కోసమే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. చిన్నారి ప్రాణాలను తీయడానికి కూడా వెనుకాడకపోవడం నిందితుల క్రూరత్వానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఈ దారుణ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

అప్పుల భారంతో తల్లి, కుమార్తె మృతి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha