Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
డ్రైవర్ కుమార్తెను పెళ్లి చేసుకున్న ఎమ్మెల్యే

డ్రైవర్ కుమార్తెను పెళ్లి చేసుకున్న ఎమ్మెల్యే

వార్త 1 week ago

Chhattisgarh : ఆడంబరాలకు, కోట్లాది రూపాయల ఖర్చులకు దూరంగా ఉంటూ ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే సాదాసీదాగా పెళ్లి చేసుకొని సమాజానికి సరికొత్త ఆదర్శంగా నిలిచారు.

బేమేతరా నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ (BJP) యువ ఎమ్మెల్యే దీపేశ్ సాహు, ప్రభుత్వ నిధులతో నిర్వహించే 'ముఖ్యమంత్రి కన్యా వివాహ యోజన కింద ఒక సాధారణ డ్రైవర్ కుమార్తె తరుణా సాహును వివాహం చేసుకున్నారు. ఆదివారం బేమేతరా జిల్లాలో ఉచితంగా నిర్వహించిన ఈ సామూహిక వివాహ వేడుకల్లో ఇతర 20కి పైగా జంటలతో కలిసి ఈ ప్రజాప్రతినిధి కూడా ఏడడుగులు వేయడం విశేషం. వివాహాలు అంటేనే అప్పులు చేసి మరీ ఆర్భాటాలు చేసే ఈ రోజుల్లో, ఒక శాసనసభ్యుడే స్వయంగా ప్రభుత్వ సామూహిక వేదికపై పెళ్లి చేసుకోవడం దేశవ్యాప్తంగా ప్రజల హృదయాలను గెలుచుకుంది.

Read Also : ఆధార్ జిరాక్స్ కాపీలకు గుడ్ బై.. క్యూఆర్ కోడ్ ద్వారానే వెరిఫికేషన్!

సారథిగా మారిన డిప్యూటీ సీఎం- ఎడ్లబండిపై ఎమ్మెల్యే ఊరేగింపు

ఈ పెళ్లి వేడుకలో మరో అరుదైన సాంప్రదాయ దృశ్యం అందరినీ ఆకట్టుకుంది. విలాసవంతమైన కార్లలో ఊరేగడానికి బదులుగా, స్థానిక సంస్కృతిని ప్రతిబింబిస్తూ ఎడ్లబండిపై ఎమ్మెల్యే దీపేశ్ సాహు బారాత్ (ఊరేగింపు) నిర్వహించారు. ఈ ఊరేగింపులో రాష్ట్ర ఉప-ముఖ్యమంత్రి (Deputy CM) అరుణ్ సావో స్వయంగా ఎడ్లబండికి సారథిగా మారి, తాడు పట్టుకొని బండిని నడపడం అక్కడికి వచ్చిన వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ అద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అనవసర ఖర్చులను అరికట్టాలనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునకు స్ఫూర్తిగా, మధ్యతరగతి కుటుంబాలపై ఉండే సామాజిక ఒత్తిడిని తగ్గించేందుకు తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ నిరాడంబర వివాహాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ సైతం ప్రత్యేకంగా అభినందించి ప్రశంసలు కురిపించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha