Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు: తప్పు ఒప్పుకున్న స్టార్ క్రికెటర్

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు: తప్పు ఒప్పుకున్న స్టార్ క్రికెటర్

వార్త 2 weeks ago

David Warner: ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో , గత నెలలో సిడ్నీలోని మారుబ్రా ప్రాంతంలో పోలీసులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో ఆయన పట్టుబడ్డారు.

పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఒక వ్యాన్ దూరంగా ఆగిపోవడాన్ని గమనించి వెళ్లగా, ఆ వాహనాన్ని నడుపుతున్నది వార్నర్ అని గుర్తించారు.

Read Also: Pat Cummins : పాట్ కమిన్స్ కు బిగ్ ఆఫర్ !!

వార్నర్‌కు నిర్వహించిన పరీక్షల్లో ఆయన రక్తంలో ఆల్కహాల్ మోతాదు చట్టబద్ధమైన పరిమితి కంటే రెండు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు తేలింది.

  • ఆల్కహాల్ కంటెంట్: సాధారణంగా 0.05 వరకు మాత్రమే అనుమతి ఉండగా, వార్నర్ రక్తంలో ఇది 0.104గా నమోదైంది.
  • కేసు నమోదు: మోతాదు రెట్టింపు ఉండటంతో పోలీసులు ఆయనపై ‘మిడిల్-రేంజ్ PCA’ కింద కేసు నమోదు చేశారు.
  • కోర్టు విచారణ: వేవర్లీ లోకల్ కోర్టులో జరగాల్సిన ఈ విచారణకు వార్నర్ హాజరు కాకపోవడంతో, కోర్టు దీనిని జూన్ నెలకు వాయిదా వేసింది.

 David Warner Drunk and Drive Case

సీరియస్‌గా తీసుకున్న క్రికెట్ వర్గాలు

క్రికెట్ న్యూ సౌత్ వేల్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ లీ జర్మన్ ఈ ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సురక్షితమైన డ్రైవింగ్‌కు తాము ప్రాధాన్యత ఇస్తామని, ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. 2024లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన వార్నర్, ప్రస్తుతం సిడ్నీ థండర్, కరాచీ కింగ్స్ వంటి జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

టేబుల్ టాపర్ లోకి RCB వెళ్తుందా ?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha