Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ద్రవిడ్ జట్టుకు అశ్విన్ కెప్టెన్

ద్రవిడ్ జట్టుకు అశ్విన్ కెప్టెన్

వార్త 1 week ago

European T20 Premier League: భారత క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ యూరప్ క్రికెట్ రంగంలోకి అడుగుపెట్టారు. యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్ (ETPL)లో భాగంగా 'డబ్లిన్ గార్డియన్స్' జట్టును ఆయన సొంతం చేసుకున్నారు.

ఈ సందర్భంగా ద్రవిడ్ మాట్లాడుతూ, యూరప్‌లో క్రికెట్‌ను అభివృద్ధి చేయడం, యువ ఆటగాళ్లకు అంతర్జాతీయ స్థాయి అవకాశాలు కల్పించాలనే లక్ష్యం తనను ఈ ప్రాజెక్టు వైపు ఆకర్షించిందని పేర్కొన్నారు.

Read Also:IPL 2026 : పంజాబ్ కింగ్స్ టీమ్ కు ఏమైంది ?

గార్డియన్స్ సారథిగా రవిచంద్రన్ అశ్విన్

డబ్లిన్ గార్డియన్స్ జట్టుకు భారత స్టార్ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. అశ్విన్ అనుభవం జట్టుకు పెద్ద ఎత్తున ప్లస్ అవుతుందని యాజమాన్యం భావిస్తోంది. ఈ లీగ్‌లో డబ్లిన్ గార్డియన్స్ జట్టు బెల్ఫాస్ట్, ఎడిన్‌బరో, గ్లాస్గో, రోటర్‌డామ్,ఆమ్‌స్టర్‌డామ్ వంటి బలమైన జట్లతో తలపడనుంది.ఈ లీగ్ ప్రారంభ కార్యక్రమానికి పలువురు దిగ్గజాలు హాజరయ్యారు. గ్లాస్గో ఫ్రాంచైజీ నుంచి విపుల్ అగర్వాల్, రోటర్‌డామ్ ప్రతినిధులుగా జోంటీ రోడ్స్, మధుకర్ శ్రీలు పాల్గొన్నారు. వీరితో పాటు ETPL సహ వ్యవస్థాపకులు అభిషేక్ బచ్చన్, సౌరవ్ బానర్జీ, ప్రియాంక కౌల్, ధీరజ్ మల్హోత్రా ఈ వేడుకలో సందడి చేశారు.

 ETPL, Rahul Dravid

European T20 Premier League: ఆగస్టు 26 నుంచి ధనాధన్ క్రికెట్

క్రికెట్ ఐర్లాండ్, క్రికెట్ స్కాట్లాండ్, రాయల్ డచ్ క్రికెట్ అసోసియేషన్‌ల సంయుక్త భాగస్వామ్యంతో ఈ లీగ్ నిర్వహించబడుతోంది. ఇందులో మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, ఫాఫ్ డు ప్లెసిస్, హెన్రిచ్ క్లాసెన్, లియామ్ లివింగ్‌స్టోన్ వంటి అంతర్జాతీయ టీ20 స్టార్లు మెరవనున్నారు. ప్రారంభ సీజన్ ఆగస్టు 26న మొదలై సెప్టెంబర్ 20 వరకు అభిమానులను అలరించనుంది.

* డబ్లిన్ ఫ్రాంచైజీ - రాహుల్ ద్రవిడ్,
* బెల్ఫాస్ట్ ఫ్రాంచైజీ - గ్లెన్ మాక్స్‌వెల్, రోహన్ లండ్,
* ఎడిన్‌బరో ఫ్రాంచైజీ - కైల్ మిల్స్, నాథన్ మెక్‌కల్లమ్, రాచెల్ వైస్‌మాన్
*గ్లాస్గో ఫ్రాంచైజీ - విపుల్ అగర్వాల్, క్రిస్ గేల్
* ఆమ్‌స్టర్‌డామ్ ఫ్రాంచైజీ - స్టీవ్ వా, జేమీ డ్వైర్, టిమ్ థామస్,
*రోటర్‌డామ్ ఫ్రాంచైజీ - జోంటీ రోడ్స్, ఫాఫ్ డు ప్లెసిస్, గ్లాషిన్, సమీర్ షా, మేనేజింగ్ పార్టనర్‌గా మధుకర్ శ్రీ.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

టాప్ ప్లేస్ పై గుజరాత్ - సన్ రైజర్స్ కన్ను

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha