Indrakeeladri Durga Temple: దుర్గమ్మవారి ఆలయంలో పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, సామాన్య భక్తులకు సౌకర్యవంతమైన దర్శనాన్ని కల్పించడంతో పాటు, ఆలయ భద్రతను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లేందుకు ఒక పటిష్టమైన యాక్షన్ ప్లాన్ను అమలు చేస్తున్నట్లు ఇఓ వికె శీనా నాయక్ తెలిపారు.
రానున్న రోజుల్లో విశేష ఉత్సవాలు ఉన్నందున, దేవస్థాన భద్రత మరియు భక్తుల సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సోమవారం ఉదయం దేవస్థాన కార్యాలయంలో నగర పోలీస్ అధికారులు, వైదిక సిబ్బంది, ఆలయ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఈవో మాట్లాడుతూ, క్షేత్రస్థాయిలో ఎలాంటి భద్రతా లోపాలకు తావులేకుండా డివోటీ ఫ్రెండ్లీ తరహా లోనే ఇంద్రకీలాద్రిపై మూడంచెల భద్రతా తనిఖీ విధానాన్ని ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నామన్నారు.
Security at the Indrakeeladri Durgamma Temple
Indrakeeladri Durga Temple:కొత్త వైదిక కమిటీ ఏర్పాటు
ఇంద్రకీలాద్రి అభివృద్ధి విషయంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, దేవాదాయ శాఖ, నగరపోలీస్, రెవిన్యూ, మున్సిపల్ కార్పొరేషన్, ధర్మకర్తల మండలి లతో సంయుక్తముగా ముందుకు సాగుతామని ఈవో వివరించారు. నూతన వైదిక కమిటీ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం 5 సభ్యులతో నూతన వైదిక కమిటీ ఏర్పాటు చేస్తూ ఇఓ నియమించారు. స్థానాచార్య వి శివప్రసాద్ శర్మ, వేద పండితులు ఎం షణ్ముఖ శాస్త్రి, ప్రధాన అర్చకులు ఎల్ దుర్గా ప్రసాద్, ఉప ప్రధాన అర్చకులు కెఎన్విడిఎం ప్రసాద్, బి శంకర శాండిల్య లను ఈ కమిటీలో నియమించారు.
Epaper: epaper.vaartha.com

