APMEPMA: ఆంధ్రప్రదేశ్‌లోని పట్టణ ప్రాంత మహిళలను ఆర్థికంగా నిలబెట్టేందుకు 'మెప్మా' (MEPMA) వినూత్న జీవనోపాధి రుణ సదుపాయాలను అందుబాటులోకి తెచ్చింది.
విభిన్న వ్యాపారాలు ప్రారంభించాలనుకునే స్వయం సహాయక సంఘాల (SHG) మహిళలకు వివిధ శ్లాబుల్లో ఆర్థిక తోడ్పాటు అందిస్తోంది.
Read Also :AP job calendar: మైనార్టీ నిరుద్యోగులకు ఫ్రీ కోచింగ్ ప్రకటించిన మంత్రి
పథకాలు & రుణ సదుపాయాలు

- తృప్తి క్యాంటీన్: ఆహార రంగంలో రాణించాలనుకునే మహిళల కోసం ఈ క్యాంటీన్ల ఏర్పాటుకు గరిష్ఠంగా ₹13.75 లక్షల వరకు రుణం అందిస్తారు.
- చాయ్ రాస్తా టీ స్టాల్: సొంతంగా టీ స్టాల్ ప్రారంభించేందుకు ₹6 లక్షల వరకు రుణ సదుపాయం కల్పిస్తారు.
- అరకు కాఫీ షాపులు: బ్రాండెడ్ కాఫీ ఔట్‌లెట్ల ఏర్పాటుకు ₹4 లక్షల నుంచి ₹10 లక్షల వరకు సహాయం లభిస్తుంది.
- కిరాణా దుకాణాలు: నిత్యావసర వ్యాపారాల విస్తరణకు ₹6.96 లక్షల వరకు రుణాలు మంజూరు చేస్తారు.
- ఎంబ్రాయిడరీ యూనిట్లు: టైలరింగ్, డిజైనింగ్ రంగాలు ఎంచుకునేవారికి ₹4.70 లక్షల నుంచి ₹8.55 లక్షల వరకు ఆర్థిక సాయం అందించనున్నారు.
APMEPMA: అర్హతలు & ప్రాధాన్యత
- వయోపరిమితి: 18 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న పట్టణ స్వయం సహాయక సంఘాల (SHG) మహిళలు ఈ రుణాలకు అర్హులు.
- విధానం: దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న (BPL) కుటుంబాలకు చెందిన మహిళలకు మొదటి ప్రాధాన్యత ఇస్తారు.

