Nandamuri Tejaswini: నందమూరి కుటుంబానికి డ్యాన్స్, నటన వారసత్వంగా వస్తాయని మరోసారి నిరూపితమైంది. టాలీవుడ్ అగ్ర హీరో నందమూరి బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని తాజాగా తనలోని సరికొత్త టాలెంట్‌ను ప్రపంచానికి పరిచయం చేశారు.
ఎప్పుడూ వ్యాపారాలు, సినిమా నిర్మాణ పనుల్లో బిజీగా ఉంటూ క్లాసీగా కనిపించే తేజస్విని.. ఒక్కసారిగా మాస్ గ్రేస్‌తో అదరగొట్టారు. ఆమెకు సంబంధించిన ఒక డ్యాన్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌లో విపరీతంగా హంగామా చేస్తోంది.
Read Also: Ram Charan - Shivanna: పెద్ది సినిమా ప్రమోషన్స్‌లో రామ్ చరణ్, శివరాజ్‌కుమార్..ఫోటో వైరల్
Balayya’s younger daughter shocked with her dance
Nandamuri Tejaswini: వావ్ అనిపించిన నందమూరి వారసురాలు
ఈ వైరల్ వీడియోలో తేజస్విని వేసిన స్టెప్పులు, ఆమె బాడీ లాంగ్వేజ్ చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు. సాధారణంగా వెండితెరకు దూరంగా ఉండే స్టార్ కిడ్స్ ఇంత పర్‌ఫెక్ట్‌గా డ్యాన్స్ చేయడం చాలా అరుదు. కానీ, తేజస్విని మాత్రం ప్రొఫెషనల్ డ్యాన్సర్ తరహాలో సాంగ్ బీట్స్‌కు తగ్గట్టుగా అద్భుతమైన టైమింగ్‌తో స్టెప్పులేసి అందరినీ ‘వావ్’ అనిపించారు.
తేజస్విని డ్యాన్స్ గ్రేస్, ఎనర్జీ చూసి నెటిజన్లు మరియు నందమూరి అభిమానులు షాక్‌కు గురవుతున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియో కింద కామెంట్ల వర్షం కురుస్తోంది. “వామ్మో.. నీ డ్యాన్స్ ముందు ఇప్పటి హీరోయిన్లు కూడా పనికిరారు తల్లీ!” అంటూ నెటిజన్లు క్రేజీగా కామెంట్స్ పెడుతున్నారు. తండ్రి బాలకృష్ణ డ్యాన్స్ స్పీడ్‌ను కూతురు పుణికిపుచ్చుకుందంటూ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
వెండితెరకు దూరంగా ఉన్నా.. టాలెంట్స్ అనేకం
తేజస్విని ఇప్పటివరకు సినిమాల్లో హీరోయిన్‌గా నటించనప్పటికీ, తెరవెనుక ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటున్నారు. ‘ఆహా’ ఓటీటీలో సూపర్ హిట్ అయిన బాలయ్య ‘అన్‌స్టాపబుల్’ షోకు ఆమె పర్యవేక్షకురాలిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అలాగే ఇటీవల ఒక ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్‌కు అంబాసిడర్‌గా మారి యాడ్‌లో మెరిశారు. ఇప్పుడు ఈ రేంజ్ డ్యాన్స్ వీడియోతో తనలో ఒక మంచి డ్యాన్సర్ కూడా ఉన్నారని నిరూపించి టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారారు. నందమూరి తేజస్విని కేవలం బిజినెస్ ఉమెన్ మాత్రమే కాదు, మల్టీ టాలెంటెడ్ అని ఈ వీడియో ద్వారా స్పష్టమైంది. ఈ డ్యాన్స్ వీడియో రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డు వ్యూస్ సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

