Ram Charan - Shivanna: తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి, కన్నడ సినీ పరిశ్రమకు మకుటం లేని మహారాజు అయిన డా. రాజ్‌కుమార్ కుటుంబానికి మధ్య దశాబ్దాల కాలంగా విడదీయరాని అనుబంధం ఉంది.
ఈ ఇరు కుటుంబాల మధ్య ఉన్న ఆత్మీయత 'పెద్ది' సినిమా ప్రమోషన్ల వేదికగా మరోసారి ప్రపంచానికి తెలిసింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్ తమ తండ్రుల నాటి ఒక అపురూపమైన మధుర జ్ఞాపకాన్ని ఇంటర్వ్యూలో గుర్తుచేస్తూ రీక్రియేట్ చేశారు. ఈ ఎమోషనల్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతూ అభిమానులను ఆకట్టుకుంటోంది.
iconic moment peddi promotions
బెంగళూరు ప్రమోషన్స్‌లో అపురూప దృశ్యం
రామ్ చరణ్, శివరాజ్‌కుమార్, జాన్వీ కపూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'పెద్ది' చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా చిత్ర యూనిట్ బెంగళూరులో ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా యాంకర్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని ప్రస్తావించారు. గతంలో మెగాస్టార్ చిరంజీవిని, కన్నడ కంఠీరవ డా. రాజ్‌కుమార్ ఎంతో ప్రేమగా దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకుంటున్న ఒక పాత బ్లాక్ అండ్ వైట్ ఫొటోను చూపించారు. అయితే ఆ అరుదైన క్షణం నాటి కెమెరాల్లో పూర్తిగా రికార్డ్ కాలేదని, ఇప్పుడు వారి వారసులుగా ఆ సీన్‌ను మరోసారి రీక్రియేట్ చేయాలని యాంకర్ కోరారు.
Read also: Ajith Kumar Mother Demise:అనారోగ్యంతో అజిత్ కుమార్ తల్లి కన్నుమూత
Ram Charan - Shivanna:చరణ్‌ను ఆత్మీయంగా హత్తుకున్న శివన్న
యాంకర్ అభ్యర్థనపై కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్ ఎంతో హుందాగా, ఆనందంగా స్పందించారు. ఆయన వెంటనే రామ్ చరణ్‌ను ఆత్మీయంగా కౌగిలించుకుని, బుగ్గపై ముద్దు పెట్టారు. శివన్న చేసిన ఈ ఊహించని, ఆప్యాయతతో కూడిన పనికి రామ్ చరణ్‌తో పాటు అక్కడున్న వారంతా ఎమోషనల్ అయ్యారు. రెండు చిత్ర పరిశ్రమలకు చెందిన పెద్ద కుటుంబాల మధ్య ఉన్న గౌరవానికి, నిఖార్సైన స్నేహానికి ఈ దృశ్యం నిదర్శనంగా నిలిచింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట షేర్ చేసిన కొద్ది నిమిషాల్లోనే వైరల్‌గా మారింది.
తరాలు మారినా సడలని స్నేహబంధం
ఒకప్పుడు చిరంజీవి, రాజ్‌కుమార్ వెండితెరపై కలిసి స్క్రీన్ షేర్ చేసుకోకపోయినప్పటికీ, వ్యక్తిగత జీవితంలో అత్యంత ఆప్తమిత్రులుగా మెలిగారు. నాడు వారి మధ్య ఉన్న ఆ పవిత్రమైన బంధాన్ని నేడు వారి కుమారులు రామ్ చరణ్, శివరాజ్‌కుమార్ కొనసాగిస్తున్నారు. కేవలం రియల్ లైఫ్‌లోనే కాకుండా 'పెద్ది' సినిమా ద్వారా రీల్ లైఫ్‌లోనూ వీరు కలిసి నటిస్తుండటం విశేషం. ఈ చిత్రంలో శివరాజ్‌కుమార్ ఒక పవర్‌ఫుల్ పాత్రను పోషిస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ రిలీజ్ కాకముందే, బయట వీరిద్దరి మధ్య కనిపించిన ఈ అటాచ్‌మెంట్ సినిమాపై అంచనాలను స్కై హైకి తీసుకెళ్లింది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read also:
పెద్ది ప్రీమియర్స్‌కు గ్రీన్ సిగ్నల్.. టికెట్ రేట్లు పెంపు!

