Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఏఐ డీప్‌ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక

ఏఐ డీప్‌ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక

వార్త 2 days ago

AI Deepfake Scams : సాంకేతికత ఎంతలా అభివృద్ధి చెందుతోందో, అదే స్థాయిలో సైబర్ నేరాలు కూడా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతను వాడుకుని కేటుగాళ్లు చేస్తున్న 'డీప్‌ఫేక్' (Deepfake) మోసాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి.

సామాన్య ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు అందరినీ టార్గెట్ చేస్తున్న ఈ కొత్త రకం సైబర్ దాడులపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి మోసాల పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, లేదంటే క్షణాల్లో బ్యాంక్ ఖాతాలు ఖాళీ అయిపోతాయని కేంద్ర సైబర్ భద్రతా విభాగం గట్టి హెచ్చరికలు జారీ చేసింది.

Read Also: Kolkata fire incident: కోల్‌కతాలో భారీ అగ్ని ప్రమాదం.. కాలిపోయిన 4,000 ఈవీఎంలు

 Centre issues key warning regarding AI deepfake scams.

AI Deepfake Scams : ఏఐ డీప్‌ఫేక్ ముప్పును అడ్డుకోవడం ఎలా?

ఆర్థిక రంగంలో గుర్తింపు దొంగతనాల (Identity Theft) నుంచి రక్షణ కల్పించేందుకు ఈ చర్యలు చేపడుతున్నారు. వీడియో-కేవైసీలో ఏఐ డీప్‌ఫేక్ ముప్పును అడ్డుకోవడం ఎలా? సింథటిక్ మీడియాను గుర్తించేందుకు ఆర్థిక సంస్థలు ఇకపై అడ్వాన్స్‌డ్ లైవ్‌నెస్ డిటెక్షన్ టెక్నాలజీని వాడాల్సి ఉంటుంది. కేవలం ఫేషియల్ రికగ్నిషన్ మాత్రమే ఇప్పుడు సరిపోదు. మల్టీ-లేయర్డ్ అథెంటికేషన్, బిహేవియరల్ బయోమెట్రిక్స్ వంటి పద్ధతులను బ్యాంకులు అమలు చేయాల్సి ఉంటుంది. దీనివల్ల స్క్రీన్‌పై కనిపిస్తున్న వ్యక్తి నిజమైన మనిషా కాదా అనేది స్పష్టమవుతుంది. ఇలాంటి చర్యలు డిజిటల్ బ్యాంకింగ్ సేవలపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచుతాయి. నిపుణుల నియామకంతో ఏఐ డీప్‌ఫేక్ ముప్పుకు చెక్ డీప్‌ఫేక్ ముప్పు పెరుగుతుండటంతో భారతీయ ఆర్థిక రంగంలో నియామకాల తీరు మారుతోంది. యాంటీ మనీ లాండరింగ్ (AML), ఫ్రాడ్ అనలిటిక్స్ నిపుణుల కోసం కంపెనీలు వేట మొదలుపెట్టాయి. అనుమానాస్పద యూపీఐ (UPI) లావాదేవీలను పసిగట్టేందుకు వీరు ప్రత్యేక అల్గారిథమ్‌లను రూపొందిస్తున్నారు. దీనివల్ల డేటా సైంటిస్టులు, సైబర్ సెక్యూరిటీ నిపుణులకు కొత్త అవకాశాలు లభిస్తున్నాయి. అలాగే, ప్రస్తుతం ఉన్న సిబ్బందికి కూడా ఏఐ భద్రతపై కంపెనీలు శిక్షణ ఇస్తున్నాయి.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

మమతను వీడిన TMC రెబల్ MPలు ఎవరంటే ..!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha