Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఏఐ ఉద్యోగ నియామకాల్లో 20% గ్రోత్

ఏఐ ఉద్యోగ నియామకాల్లో 20% గ్రోత్

వార్త 2 weeks ago

AI Jobs : దేశంలో వైట్ కాలర్ ఉద్యోగాల నియామకాల ప్రక్రియ క్రమంగా పుంజుకుంటోంది. ప్రముఖ జాబ్ పోర్టల్ 'నౌకరీ.కామ్' (Naukri.com) విడుదల చేసిన నివేదిక ప్రకారం, సెప్టెంబర్ నెలలో మొత్తం వైట్ కాలర్ జాబ్ రిక్రూట్‌మెంట్ 2 శాతం వృద్ధిని నమోదు చేసింది.

ఇందులో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మరియు మెషిన్ లెర్నింగ్ (ML) రంగాలు రికార్డు స్థాయిలో ఏకంగా 20 శాతం నియామకాల వృద్ధిని సాధించి అగ్రస్థానంలో నిలిచాయి. సాంకేతిక పరిజ్ఞానం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కంపెనీలు ఏఐ సాంకేతికతపై విపరీతంగా పెట్టుబడులు పెడుతుండటమే ఈ రికార్డు వృద్ధికి ప్రధాన కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. ఏఐతో పాటు ఆటోమొబైల్ రంగంలో 11 శాతం, ఐటీఈఎస్ (ITES) విభాగంలో 4 శాతం ఉద్యోగ నియామకాలు పెరిగాయి. అయితే, మరోవైపు టూరిజం రంగానికి సంబంధించి 11 శాతం, విద్యా (Education) రంగానికి సంబంధించి 18 శాతం చొప్పున నియామకాలలో తగ్గుదల నమోదవ్వడం గమనార్హం.

ఐటీ నగరాల్లో ఊపందుకున్న రిక్రూట్‌మెంట్: హైదరాబాద్ టాప్

మెట్రో నగరాల వారీగా ఉద్యోగ నియామకాల గణాంకాలను పరిశీలిస్తే, దేశీయ ఐటీ రాజధానిగా ఎదుగుతున్న హైదరాబాద్ నగరంలో అత్యధికంగా 9 శాతం గ్రోత్ నమోదైంది. నగరంలో పెరుగుతున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు (GCCs) మరియు ఐటీ రంగా విస్తరణ ఇందుకు ఎంతగానో దోహదపడ్డాయి. హైదరాబాద్ తర్వాత తమిళనాడు రాజధాని చెన్నై 6 శాతం వృద్ధితో రెండో స్థానంలో నిలవగా, సిలికాన్ వ్యాలీ బెంగళూరు మరియు కోల్‌కతా నగరాలు చెరో 4 శాతం ఉద్యోగ నియామకాల వృద్ధిని నమోదు చేశాయి. సాంకేతిక నైపుణ్యాలు కలిగిన నిపుణులకు, ముఖ్యంగా డేటా సైన్స్, ఏఐ డెవలప్‌మెంట్ మరియు ఆటోమేషన్ రంగాల నిపుణులకు ప్రస్తుతం మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్ ఉందని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.

ఏపీలో 163 గ్రూప్-1 పోస్టులు.. అక్టోబర్ 6 నుంచి దరఖాస్తులు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha