APPSC Group 1 2026: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 163 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు అక్టోబర్ 6, 2026 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుల స్వీకరణకు అక్టోబర్ 27, 2026ను చివరి తేదీగా నిర్ణయించారు. అభ్యర్థులు నోటిఫికేషన్‌లో పేర్కొన్న అర్హతలు, వయోపరిమితి, ఎంపిక విధానం తదితర వివరాలను పరిశీలించి దరఖాస్తు చేసుకోవాలి.
Read Also :APPSC Notification 2026: ఏపీలో 20 శాఖలకు సంబంధించిన ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల
APPSC Group 1 2026: ఏపీపీఎస్సీ గ్రూప్-1లో ఉన్న పోస్టుల వివరాలు
ఈ నోటిఫికేషన్‌లో డిప్యూటీ కలెక్టర్, డీఎస్పీ, అసిస్టెంట్ కమిషనర్, జిల్లా విద్యాశాఖ అధికారి, ఆర్టీవో, మున్సిపల్ కమిషనర్ వంటి కీలక ఉద్యోగాలు ఉన్నాయి.

- డిప్యూటీ కలెక్టర్ - 11 పోస్టులు
- ట్యాక్స్ సర్వీసెస్ అసిస్టెంట్ కమిషనర్ - 14 పోస్టులు
- డీఎస్పీ సివిల్ - 36 పోస్టులు
- డీఎస్పీ కమ్యూనికేషన్స్ - 3 పోస్టులు
- జిల్లా విద్యాశాఖ అధికారి (DEO) - 14 పోస్టులు
- ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ - 1 పోస్ట్
- రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్ (RTO) - 3 పోస్టులు
- డిప్యూటీ రిజిస్ట్రార్, కోఆపరేటివ్ సర్వీసెస్ - 15 పోస్టులు
- మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-2 - 12 పోస్టులు
- అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ - 2 పోస్టులు
- డిస్ట్రిక్ట్ ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ - 3 పోస్టులు
- అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ - 14 పోస్టులు
- డివిజినల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ - 35 పోస్టులు
మొత్తం 163 గ్రూప్-1 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ చర్యలు చేపట్టింది. గ్రూప్-1 ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశంగా మారనుంది. దరఖాస్తు చేసుకునే ముందు అధికారిక నోటిఫికేషన్‌ను పూర్తిగా చదివి, అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకోవాలని సూచిస్తున్నారు.

