Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఏఐతో భవిష్యత్తులో భారీగా ఉద్యోగాలు, వ్యాపార అవకాశాలు.. మార్క్ జుకర్‌బర్గ్

ఏఐతో భవిష్యత్తులో భారీగా ఉద్యోగాలు, వ్యాపార అవకాశాలు.. మార్క్ జుకర్‌బర్గ్

వార్త 2 weeks ago

Meta AI Jobs: కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ - AI) కారణంగా భవిష్యత్తులో విస్తారమైన కొత్త ఉద్యోగాలు, వ్యాపార అవకాశాలు ఏర్పడతాయని మెటా అధినేత, సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ వెల్లడించారు.

సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న కొద్దీ ఏఐ సాయంతో చిన్న బృందాలు కూడా భారీ స్థాయి కంపెనీలను, వ్యాపారాలను ఎంతో సులువుగా నిర్వహించగల సామర్థ్యాన్ని పొందుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Read Also : NBEMS City Intimation Slip: నీట్ పీజీ 2026 సిటీ అలకేషన్ స్లిప్ విడుదల: డౌన్‌లోడ్ చేసుకోవడానికి లింక్ ఇదిగో!

Meta AI Jobs: ఉద్యోగాల తొలగింపు వేళ ఆసక్తికర వ్యాఖ్యలు

ఇటీవల మెటా సంస్థ ప్రపంచవ్యాప్తంగా సుమారు 8,000 ఉద్యోగాలను తొలగించిన (ల Layoffs) నేపథ్యంలో జుకర్‌బర్గ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఒకవైపు ఉద్యోగాలు పోతున్నాయనే ఆందోళన ఉన్నప్పటికీ, సాంకేతిక మార్పులలో ఇది ఒక భాగమని ఆయన అభిప్రాయపడ్డారు.

ఏఐ రావడంతో సంప్రదాయ ఉద్యోగాల స్వరూపం వేగంగా మారుతోందని జుకర్‌బర్గ్ గుర్తుచేశారు. ఒకవైపు కొన్ని పాత ఉద్యోగ రకాల ఉనికి తగ్గినప్పటికీ, మరొకవైపు ఇది సరికొత్త రంగాలు, సాంకేతిక విభాగాలలో లెక్కలేనన్ని ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఏఐ సాంకేతికత భవిష్యత్తు వ్యాపార రంగానికి కొత్త దిశను చూపుతుందని ఆయన పేర్కొన్నారు.

అమెరికా వలసదారులకు కొత్త ఆన్‌లైన్ నిబంధనలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha