Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఏఐతో కొత్త ఉద్యోగాలు !!

ఏఐతో కొత్త ఉద్యోగాలు !!

వార్త 2 weeks ago

Layoffs : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికత విస్తరణ వల్ల ఉద్యోగాలు పోతాయనే ఆందోళనల నడుమ జపాన్‌కు చెందిన ప్రముఖ విశ్లేషణా సంస్థ 'నోమురా హోల్డింగ్స్' (Nomura Holdings) ఊరటనిచ్చే నివేదికను విడుదల చేసింది.

భారతదేశంలో ఏఐ సాంకేతికత కారణంగా ఉద్యోగాలు కోల్పోతున్న వారి కంటే, కొత్తగా ఉద్యోగాల్లో చేరుతున్న వారి సంఖ్యే అత్యధికంగా ఉందని ఈ రిపోర్ట్ స్పష్టం చేసింది. 2022 సంవత్సరం నుండి ఇప్పటివరకు (ఆగస్టు 2026 నాటికి) దేశంలో ఏఐ ప్రభావంతో 31,921 మంది ఉద్యోగాలు కోల్పోగా, దానికి మూడు రెట్ల కంటే ఎక్కువగా అంటే 83,100 కొత్త ఉద్యోగ నియామకాలు (Hiring) జరిగాయని లెక్కలు వెల్లడించాయి. ఇది భారత ఐటీ రంగానికి సానుకూల పరిణామమని విశ్లేషకులు భావిస్తున్నారు.

 US layoffs

నియామకాలు మరియు తొలగింపుల తీరు

ఈ నివేదిక ప్రకారం, ఉద్యోగాలు కోల్పోయిన వారిలో ప్రధానంగా చాట్‌బోట్‌ల వినియోగం పెరగడం వల్ల కస్టమర్ సపోర్ట్, డేటా ఎంట్రీ వంటి సాంప్రదాయ విధులు నిర్వహించే సపోర్ట్ టీమ్ ఉద్యోగులే ఎక్కువగా ఉన్నారు. అదే సమయంలో, ఐటీ సర్వీసెస్ విభాగంలో కొత్త నైపుణ్యాలు కలిగిన గ్రాడ్యుయేట్లకు, ప్రాసెస్ ఇంజనీర్లకు భారీగా డిమాండ్ పెరిగింది. భారత్‌లోనే కాకుండా మొత్తం ఆసియా ఖండం వ్యాప్తంగా ఏఐ విస్తరణ వలన 1,30,758 కొత్త ఉద్యోగాలు వచ్చినట్లు నోమురా నివేదిక స్పష్టం చేసింది. సాంకేతిక మార్పులకు అనుగుణంగా ఉద్యోగులు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటే (Reskilling) ఏఐ వల్ల మరిన్ని కొత్త అవకాశాలు వెల్లువెత్తుతాయని ఈ గణాంకాలు నిరూపిస్తున్నాయి.

హసీనా వ్యాఖ్యలకు భారత్ దూరం.. స్పష్టత ఇచ్చిన కేంద్రం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha