Samsung: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రపంచాన్ని ఎలా మారుస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా ఈ ఏఐ విప్లవం శాంసంగ్ (Samsung) కంపెనీ ఉద్యోగుల పాలిట వరంగా మారింది.
ఏఐ చిప్‌ల విక్రయాల ద్వారా కంపెనీ సెమీకండక్టర్ విభాగం సాధించిన అసాధారణ లాభాలను తన సిబ్బందికి పంచాలని యాజమాన్యం నిర్ణయించింది. ఇందులో భాగంగా చిప్ డివిజన్‌లో పనిచేసే ప్రతి ఉద్యోగికి సగటున 3,40,000 డాలర్లు (భారతీయ కరెన్సీలో దాదాపు రూ. 3.25 కోట్లు) బోనస్‌గా లభించనుంది.
bonus ai boom profits
Read also: Jio OTT Pass: జియో సరికొత్త ఓటీటీ పాస్ విడుదల
సమ్మె ముప్పు తప్పినట్లే.. ఉద్యోగ సంఘాల గ్రీన్ సిగ్నల్
ఈ భారీ బోనస్ ప్యాకేజీకి సంబంధించి శాంసంగ్ యాజమాన్యం, కార్మిక సంఘాల మధ్య జరిగిన చర్చలు సఫలమయ్యాయి. నిర్వహించిన ఓటింగ్‌లో 95 శాతం మందికి పైగా సభ్యులు పాల్గొనగా, అందులో 73.7 శాతం మంది ఈ ఒప్పందానికి మద్దతుగా ఓటేశారు. దీనివల్ల దాదాపు 18 రోజుల పాటు జరగాల్సిన సమ్మె విరమణ పొందింది. ఒకవేళ ఈ సమ్మె గనుక జరిగి ఉంటే శాంసంగ్ ఉత్పత్తుల మీదే కాకుండా గ్లోబల్ సప్లై చైన్ (ప్రపంచ సరఫరా వ్యవస్థ) పై కూడా తీవ్ర ప్రభావం పడేది.
Samsung: 49 రెట్లు పెరిగిన ఆదాయం.. బోనస్ ఎవరికి వర్తిస్తుంది?
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏఐ డేటా సెంటర్ల కోసం మెమరీ చిప్‌లకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఈ రేసులో ముందంజలో ఉన్న శాంసంగ్ గత త్రైమాసికంలో తన చిప్ విభాగం ద్వారా ఏకంగా 49 రెట్లు ఎక్కువ ఆదాయాన్ని అర్జించింది. ఈ భారీ బోనస్ కేవలం ప్రాసెసర్లు, మెమరీ చిప్‌లను తయారు చేసే సెమీకండక్టర్ విభాగంలోని సుమారు 78,000 మంది ఉద్యోగులకు మాత్రమే అందుతుంది. ఒప్పందం ప్రకారం చిప్ డివిజన్ సాధించిన ఆపరేటింగ్ ప్రాఫిట్‌లో 10.5 శాతాన్ని షేర్ల రూపంలో, మరో 1.5 శాతాన్ని నేరుగా నగదు రూపంలో కార్మికులకు అందిస్తారు. ఈ బోనస్ పంపిణీ కోసం శాంసంగ్ దాదాపు 26.5 బిలియన్ డాలర్లను కేటాయించనుంది.
రికార్డుల వేటలో శాంసంగ్
ఇటీవలే తైవాన్‌కు చెందిన ప్రముఖ సంస్థ టీఎస్‌ఎంసీ (TSMC) తర్వాత మార్కెట్ విలువలో ట్రిలియన్ డాలర్ల మైలురాయిని దాటిన రెండవ ఆసియా కంపెనీగా శాంసంగ్ సరికొత్త రికార్డు సృష్టించింది. కాగా, ఏఐ బూమ్ కారణంగా గతంలో మరో చిప్ దిగ్గజం ‘ఎస్‌కే హైనిక్స్’ కూడా తమ ఉద్యోగులకు ఇలాగే భారీ బోనస్‌లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read also:
తెలంగాణకు మూడేళ్లలో రూ. 5.45 లక్షల కోట్ల ఆదాయం.. కానీ తప్పని అప్పుల వేట!

