Jio OTT Pass: టెలికాం రంగంలో ఎప్పుడూ సంచలనాలు సృష్టించే రిలయన్స్ జియో, వినోద ప్రియుల కోసం మరో అదిరిపోయే ప్లాన్‌ను మార్కెట్లోకి తెచ్చింది. కేవలం రూ.
200 లకే ప్రైమ్ వీడియో, యూట్యూబ్ ప్రీమియం వంటి ప్రముఖ ఓటీటీల సబ్‌స్క్రిప్షన్లతో కూడిన "జియో ఓటీటీ పాస్" (Jio OTT Pass) ను అధికారికంగా లాంచ్ చేసింది.
jio 200 rupees ott pas
ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్యాక్ ద్వారా వినియోగదారులు ఏకంగా 15 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లతో పాటు, హైస్పీడ్ డేటా మరియు వెయ్యికి పైగా లైవ్ టీవీ ఛానెళ్లను ఉచితంగా పొందవచ్చు. ఈ సరికొత్త రీఛార్జ్ ప్లాన్ ఇవాళ్టి నుంచే అన్ని ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులోకి వచ్చింది.
రూ.1500 విలువైన బెనిఫిట్స్.. కేవలం రూ.200 కే!
నిజానికి మార్కెట్లో ఈ ఓటీటీల విడివిడి సబ్‌స్క్రిప్షన్ల విలువ దాదాపు రూ.1,500 వరకు ఉంటుంది. కానీ, జియో తన కస్టమర్ల కోసం దీనిని కేవలం రూ.200 కే అందిస్తోంది.
Jio OTT Pass: ఈ ప్యాక్‌లో లభించే ప్రధాన ఓటీటీలు:
యూట్యూబ్ ప్రీమియం (YouTube Premium): ఎలాంటి యాడ్స్ లేకుండా వీడియోలు చూడొచ్చు. బ్యాక్‌గ్రౌండ్ ప్లే, ఆఫ్‌లైన్ డౌన్‌లోడ్స్ ఫీచర్లు లభిస్తాయి. ప్రైమ్ వీడియో (మొబైల్ ఎడిషన్), జియోహాట్‌స్టార్ (మొబైల్ + హాలీవుడ్)
జియోటీవీ యాప్ ద్వారా లభించే ఇతర ఓటీటీలు:
సోనీలివ్ (SonyLIV), జీ5 (Zee5), లయన్స్‌గేట్ ప్లే, డిస్కవరీ+, సన్ నెక్స్ట్, ఫ్యాన్‌కోడ్, ప్లానెట్ మరాఠీ, చౌపాల్, హోయ్‌చోయ్‌తో సహా మొత్తం 12 రీజినల్ మరియు ఇంటర్నేషనల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల కంటెంట్‌ను జియోటీవీ (JioTV) యాప్ ద్వారా వీక్షించవచ్చు.
1000 కి పైగా లైవ్ టీవీ ఛానెళ్లు & పెయిడ్ ఛానెల్స్
ఈ ప్యాక్ తీసుకున్న వారికి జియోటీవీ యాప్‌లో 1,000 కి పైగా లైవ్ టీవీ ఛానెళ్లను చూసే అవకాశం ఉంటుంది. ఇందులో స్టార్ ప్లస్ HD, కలర్స్ HD, సన్ టీవీ HD, డిస్కవరీ, యానిమల్ ప్లానెట్ వంటి 150 కి పైగా ప్రీమియం (పెయిడ్) ఛానెళ్లు కూడా ఉచితంగా వస్తాయి.
డేటా బెనిఫిట్స్ మరియు వ్యాలిడిటీ వివరాలు
డేటా: ఈ ప్యాక్ ద్వారా 30 GB హైస్పీడ్ 4G/5G డేటా లభిస్తుంది. అర్హత గల వినియోగదారులకు అపరిమిత (Unlimited) 5G సేవలు కూడా అందుతాయి.
వ్యాలిడిటీ: ఈ జియో ఓటీటీ పాస్ కాలపరిమితి 28 రోజులు.
ఎవరు రీఛార్జ్ చేసుకోవచ్చు?: ఇప్పటికే ఏదైనా యాక్టివ్ బేస్ ప్లాన్ (కాలింగ్/డేటా ప్లాన్) ఉన్న జియో కస్టమర్లు ఎవరైనా ఈ ఓటీటీ పాస్‌ను అదనంగా యాక్టివేట్ చేసుకోవచ్చు. మైజియో (MyJio) యాప్, జియో అధికారిక వెబ్‌సైట్ (Jio.com), జియో రిటైల్ స్టోర్లతో పాటు గూగుల్ పే, ఫోన్ పే వంటి థర్డ్-పార్టీ రీఛార్జ్ యాప్స్ ద్వారా కూడా దీనిని యాక్టివేట్ చేసుకోవచ్చు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read also:

