NEET Student Suicide: దేశవ్యాప్తంగా నీట్ (NEET) వివాదం తీవ్ర చర్చనీయాంశమవుతున్న తరుణంలో మహారాష్ట్రలో మరొక ఘటన వెలుగుచూసింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసినప్పటికీ విద్యార్థుల ఆత్మహత్యలు ఆగకపోవడం కలకలం రేపుతోంది.
మహారాష్ట్రలోని అహల్యానగర్ జిల్లా కర్ణత్ తాలూకా పరిధిలోని జలాల్ పూర్ గ్రామానికి చెందిన నీట్ విద్యార్థిని అంకితా సంగ్లే ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
ఆషాడ ఏకాదశి సందర్భంగా అంకిత తల్లిదండ్రులు, అన్నయ్య పండర్‌పూర్‌కు వెళ్లడంతో ఆమె ఇంట్లో ఒంటరిగా ఉంది. సాయంత్రం 5:30 గంటల ప్రాంతంలో సమీప బంధువులు వచ్చి చూడగా, సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ విగతజీవిగా కనిపించింది. స్థానిక పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభింంచారు.
Read Also: Cheruvugattu Fire Accident: చెర్వుగట్టు గుట్ట కింద ఘోర అగ్నిప్రమాదం!
Please forgive me if I have done anything wrong… Another NEET student commits suicide.
NEET Student Suicide: మిస్ కన్నీరు పెట్టించే సూసైడ్ నోట్
పోలీసుల విచారణలో అంకిత రాసిన సూసైడ్ నోట్ లభించింది. నీట్ రీ-ఎగ్జామ్‌లో ఆమెకు 166 మార్కులు రాగా, కటాఫ్ మార్కులు 177గా ఉన్నాయి. కేవలం 11 మార్కుల తేడాతో కటాఫ్ కోల్పోవడంతో, డాక్టర్ కావాలన్న తన కల నెరవేరలేదని తీవ్ర మనస్తాపానికి గురైంది. లేఖలో.. "అమ్మా నాన్నా మీరు నా కోసం ఎంతో కష్టపడ్డారు, కానీ మీ కలను నెరవేర్చలేకపోతున్నా. అన్నయ్య.. అమ్మా నాన్నను జాగ్రత్తగా చూసుకో. నేను ఏదైనా తప్పు చేస్తే నన్ను క్షమించండి" అని భావోద్వేగంగా రాసుకొచ్చింది. తాను ఒక సగటు విద్యార్థిని మాత్రమేనని, కుటుంబం అంచనాలను అందుకోలేకపోయానని పేర్కొంటూ, తన చావుకు ఎవరినీ నిందించవద్దని కోరింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Epaper: epaper.vaartha.com
నటి ట్విషా శర్మ కేసు.. రిటైర్డ్ జడ్జి గిరిబాలా సింగ్ బెయిల్ తిరస్కరణ!

