Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నటి ట్విషా శర్మ కేసు.. రిటైర్డ్ జడ్జి గిరిబాలా సింగ్ బెయిల్ తిరస్కరణ!

నటి ట్విషా శర్మ కేసు.. రిటైర్డ్ జడ్జి గిరిబాలా సింగ్ బెయిల్ తిరస్కరణ!

వార్త 1 week ago

Twisha Sharma Case: మాజీ మోడల్, నటి ట్విషా శర్మ (Twisha Sharma) అనుమానాస్పద మృతి కేసులో నిందితురాలిగా ఉన్న రిటైర్డ్ జడ్జి గిరిబాలా సింగ్ (Giribala Singh) కు భోపాల్‌లోని ప్రత్యేక సీబీఐ కోర్టులో దెబ్బతగిలింది.

ఆమె దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను శనివారం ప్రత్యేక న్యాయస్థానం కొట్టివేసింది. ఆమెపై ఉన్న ఆరోపణలు అత్యంత తీవ్రమైనవని వ్యాఖ్యానిస్తూ బెయిల్ నిరాకరించింది. మృతురాలు ట్విషా శర్మకు గిరిబాలా సింగ్ అత్త కాగా.. ఆమె భర్త సమర్థ్ సింగ్ (Samarth Singh). మే 12న ట్విషా తన అత్తగారింట్లో ఉరివేసుకుని అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. ఈ ఘటనపై వరకట్న వేధింపులు, మానసిక వేధింపులు, గృహహింస చట్టాల కింద గిరిబాలా సింగ్, ఆమె కుమారుడు సమర్థ్ సింగ్‌లను సీబీఐ (CBI) అరెస్ట్ చేసి విచారిస్తోంది.

Read Also:Cheruvugattu Fire Accident: చెర్వుగట్టు గుట్ట కింద ఘోర అగ్నిప్రమాదం..32 దుకాణాలు బూడిద!

కోర్టులో డిఫెన్స్ (రక్షణ పక్షం) వాదనలు

గిరిబాలా సింగ్ న్యాయవాదులు మానవతా దృక్పథంతో బెయిల్ మంజూరు చేయాలని కోరారు:

  • ఆమె వయోవృద్ధురాలని, వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, జైలులో సరైన వైద్య సహాయం అందడం లేదని తెలిపారు.
  • గిరిబాలా సింగ్‌పై ఆధారపడి ఉన్న ఆమె తల్లికి దాదాపు 100 ఏళ్ల వయస్సు ఉందని పేర్కొన్నారు.
  • నిందితురాలు నిరంతరం క్రమం తప్పకుండా జీతం, 'వార్ విడో పెన్షన్' పొందుతున్నారని, అందువల్ల కట్నం డిమాండ్ చేశారన్న ఆరోపణల్లో నిజం లేదని వాదించారు. అలాగే పోలీసుల విచారణకు సహకరించారని, కస్టడీలో ఉన్న సమయంలో ఆమె ఇంట్లో దొంగతనం కూడా జరిగిందని కోర్టు దృష్టికి తెచ్చారు.

Twisha Sharma Case: సీబీఐ కౌంటర్ - బెయిల్ తిరస్కరణకు ప్రధాన కారణాలు

కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) బెయిల్ ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. సీబీఐ లేవనెత్తిన ప్రధానాంశాలు:

  1. మహిళ అనే కారణంతో బెయిల్ ఇవ్వలేం: బాధితురాలు (మృతురాలు) కూడా మహిళే అయినందున, కేవలం మహిళ అన్న కారణంతో బెయిల్ మంజూరు చేయలేమని తెలిపింది.
  2. మునుపటి ముందస్తు బెయిల్ రద్దు: మే 27న మధ్యప్రదేశ్ హైకోర్టు.. కింది కోర్టు గిరిబాలా సింగ్‌కు మంజూరు చేసిన ముందస్తు బెయిల్‌ను ఇప్పటికే రద్దు చేసిందని గుర్తుచేసింది.
  3. వాయిస్ శాంపిల్ నిరాకరణ & సాక్ష్యాల ట్యాంపరింగ్ యత్నం: విచారణలో భాగంగా వాయిస్ శాంపిల్ ఇచ్చేందుకు గిరిబాలా సింగ్ నిరాకరించారని తెలిపింది. అంతేకాకుండా, కేసుతో సంబంధం ఉన్న సీసీటీవీ టెక్నీషియన్, ఒక సలూన్ నిర్వాహకురాలిని సంప్రదించి, సీసీటీవీ ఫుటేజ్ పొందేందుకు ప్రైవేట్ ప్రతినిధిని పంపి విచారణను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారని సీబీఐ బలంగా వాదించింది.

బయటకు వస్తే సాక్షులను బెదిరించే అవకాశం, సాక్ష్యాలను తారుమారు చేసే ముప్పు ఉందని సీబీఐ చేసిన వాదనలతో ఏకీభవించిన ప్రత్యేక న్యాయమూర్తి రామ్ ప్రతాప్ మిశ్రా బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించారు.

Epaper: epaper.vaartha.com

కూకట్‌పల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha