Patancheru Congress BRS Clash: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పట్టణంలో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీల శ్రేణులు పోటాపోటీగా ఆందోళన బాట పట్టడంతో పటాన్‌చెరు జాతీయ రహదారి (NH 65) పరిసరాలు రణరంగంగా మారాయి.
ఇరు పార్టీల కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పరస్పరం ఎదురెదురుగా నిలబడి నిరసనలకు దిగడంతో వాతావరణం క్షణక్షణం వేడెక్కింది. నువ్వా-నేనా అన్న రీతిలో నేతలు కాలుదువ్వడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న తీవ్ర ఆందోళన వ్యక్తమైంది.
మారుమోగిన నినాదాలు.. జాతీయ రహదారి దిగ్బంధం
ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ బీఆర్‌ఎస్ నాయకులు తీవ్రస్థాయిలో నినాదాలు చేయగా.. మరోవైపు గత బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలోని అవినీతి, ప్రజా వంచనను ఎండగడుతూ కాంగ్రెస్ కార్యకర్తలు ఎదురుదాడికి దిగారు. వీరికి తోడుగా తమ సమస్యల పరిష్కారం కోసం విద్యార్థి సంఘాలు సైతం ఏకకాలంలో ఆందోళనకు దిగడంతో పటాన్‌చెరు చౌరస్తా, జాతీయ రహదారి పూర్తిగా స్తంభించిపోయింది. వాహనాల రాకపోకలు నిలిచిపోయి కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
Patancheru Congress BRS Clash: తలలు పట్టుకున్న పోలీసులు.. శాంతిభద్రతల పరిరక్షణకు భారీ బందోబస్తు
ఇరుపార్టీల నేతలు బాహాబాహీకి దిగేలా ఘర్షణ వాతావరణం నెలకొనడంతో రంగంలోకి దిగిన పోలీసు యంత్రాంగం పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఏకకాలంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్, విద్యార్థుల ఆందోళనలను నియంత్రించడం పోలీసులకు పెను సవాలుగా మారింది. ఇరువర్గాల మధ్య ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, ఘర్షణలు చోటుచేసుకోకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి భారీగా బలగాలను మోహరించారు. తీవ్ర ఉద్రిక్తత నడుమ ఇరుపక్షాల ముఖ్య నేతలను అదుపులోకి తీసుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు
Epaper: epaper.vaartha.com
స్పీకర్‌కు ఆదేశాలు ఇవ్వడానికి మీరెవరు? హరీశ్‌రావుపై శ్రీధర్‌బాబు ఫైర్

