Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
స్పీకర్‌కు ఆదేశాలు ఇవ్వడానికి మీరెవరు? హరీశ్‌రావుపై శ్రీధర్‌బాబు ఫైర్‌

స్పీకర్‌కు ఆదేశాలు ఇవ్వడానికి మీరెవరు? హరీశ్‌రావుపై శ్రీధర్‌బాబు ఫైర్‌

వార్త 3 weeks ago

Sridhar Babu: శాసనసభ స్పీకర్ స్థానాన్ని ఉద్దేశించి బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు బెదిరింపు ధోరణితో మాట్లాడటం ప్రజాస్వామ్య వ్యవస్థలకే అత్యంత ప్రమాదకరమని రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

అసెంబ్లీని ఏ విధంగా నడపాలో స్పీకర్‌కు హుకుం జారీ చేయడానికి, “ఇలా చేయాలి, అలా చేయకూడదు” అని శాసించడానికి ప్రతిపక్ష నేతలు ఎవరని ఆయన సూటిగా ప్రశ్నించారు. రాజ్యాంగబద్ధమైన ఉన్నత స్థానంలో ఉన్న స్పీకర్‌ను బెదిరించేలా వ్యవహరించడం సంప్రదాయాలకు పూర్తిగా విరుద్ధమని తేల్చిచెప్పారు.

వీడియో ఫుటేజీలో స్పష్టంగా రికార్డైన దూషణలు

సభాపతి స్థానంపై జరిగిన దూషణల పర్వంలో ప్రతిపక్ష నేతలు ఏ విధంగా మాట్లాడారనేది అసెంబ్లీ వీడియో ఫుటేజీల్లో అత్యంత స్పష్టంగా రికార్డై కనిపిస్తోందని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. చట్టసభ నిబంధనలకు తూట్లు పొడిచేలా వ్యవహరించి, ఇప్పుడు తాము ఎలాంటి తప్పు చేయలేదన్నట్లుగా మాట్లాడటం సరికాదన్నారు. సభా మర్యాదలను కాపాడేందుకు నిబంధనల ప్రకారం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడం తథ్యమని ఆయన సంకేతాలు ఇచ్చారు.

Sridhar Babu: బీఆర్ఎస్ విమర్శలను కొట్టిపారేసిన మంత్రి

మహిళా ప్రజాప్రతినిధులపై జరిగిన ఘటనలను ప్రభుత్వం మరియు స్పీకర్ పట్టించుకోవడం లేదంటూ బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలను శ్రీధర్ బాబు పూర్తిగా తిరసరించారు. మహిళా ఎమ్మెల్యేల అంశంపై సమగ్ర నివేదికను అందజేయాలని స్పీకర్ స్వయంగా ఆదేశాలు జారీ చేశారని గుర్తుచేశారు. ఒకవైపు మహిళా సభ్యుల అంశాన్ని తెరపైకి తెస్తూనే, మరోవైపు స్పీకర్‌ను నేరుగా అవమానించిన పెద్ద తప్పును విస్మరించాలని కోరడం ప్రతిపక్షాల ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు.

Epaper: epaper.vaartha.com

మహిళా పోలీసుల ముందే బట్టలు ఎందుకు విప్పాలి? సీతక్క ఆగ్రహం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha