Srikakulam Port Works: శ్రీకాకుళం జిల్లా మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్టు పనులు ఈ ఏడాది చివరి నాటికీ ఆపరేషన్ ప్రారంభించి జాతికి అంకితం చేస్తామని మంత్రులు అచ్చెన్నాయుడు, బిసి జనార్దనరెడ్డి స్పష్టం చేశారు.
మూలపేట పోర్టులో జరుగుతున్న అభివృద్ధి పనులను మంత్రులు సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్టు పనులు కేవలం 20 శాతం మాత్రమే చేపట్టినట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 70 శాతం వరకు పనులు పూర్తి చేసినట్లు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.
Ministers review Moolapet port works
Srikakulam Port Works: భూముల కేటాయింపు, రవాణా సదుపాయాలు
పోర్ట్కు రవాణా సదుపాయం ముఖ్యమని, అందుకు సంబంధించి ఉప్పు భూములు అవసరమని, ఉప్పు భూములు కోసం కేంద్ర ప్రభుత్వానికి ఒక్క లేఖ పంపలేదన్నారు. పోర్టుకు ఉప్పు భూములు 400 ఎకరాలు అవసరమైతే 399 ఎకరాలు భూములు 99 సంవత్సరాలకు లీజుకు ఇచ్చినట్లు వెల్లడించారు. అక్కడ అటవీ శాఖ భూములు ఉన్నాయని, వాటిని తీసుకొని అటవీ శాఖ కు కాంపన్సేషన్ వేరే ప్రాంతంలో ఇస్తామన్నారు. రోడ్డు, రైల్వే పనులు జరగక పోర్ట్ ప్రారంభం జరగలేదని, ఆ పనులు త్వరితగతిన చేపడుతున్నట్లు చెప్పారు. ట్రయల్ కుమరో షిప్ తీసుకు వస్తామని, అనంతరం ఈ యేడాదే మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ ప్రారంభిస్తామన్నారు.

నిర్వాసితుల పునరావాసం
ఆర్ అండ్ ఆర్ కాలనీలో అంగన్వాడీ కేంద్రాలు, తాగునీరు, దేవదాయం, తదితర మౌలిక వసతులు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. మూలపేట పోర్టు నిర్వాసితులకు ఏర్పాటు చేయనున్న ఆర్ అండ్ ఆర్ కాలనీ ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ ప్రాంతానికి పోర్టుతో అనుబంధమయ్యే పరిశ్రమలు రావాలన్నారు. పరిశ్రమలు వస్తే తప్ప ఉపాధి ఉండదన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు సానుకూల వాతావరణం ఉండాలన్నారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్తో కలిసి పోర్టు పనుల తీరుతెన్నులను ప్రత్యేకంగా మంత్రులు పరిశీలించారు. అనంతరం పోర్టు పనుల పురోగతిపై అధికారులతోను, పోర్టు యాజమాన్యంతో సమీక్షించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:

