Maisigandi Maisamma Temple: రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలంలోని ప్రసిద్ధి గాంచిన మైసిగండి మైసమ్మ ఆలయంలో మంగళవారం భక్తి వాతావరణం నెలకొంది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు చల్లా వంశీచంద్ రెడ్డి,ఎంపీ మల్లు రవి,మంత్రి జూపల్లి కృష్ణారావు లతో కలిసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Read Also:TTD: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్: క్యూలైన్లలో వర్చువల్ రియాలిటీ
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛారణల నడుమ వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం మహేష్ కుమార్ గౌడ్, వంశీచంద్ రెడ్డి దేవస్థానంలో అభిషేకం, అర్చన, హారతి వంటి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అమ్మవారికి పుష్పాలు సమర్పించి, కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. రాష్ట్రంలో శాంతి, సుభిక్షం నెలకొనాలని, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థనలు చేశారు.
ఈ కార్యక్రమంలో కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, పీసీసీ సభ్యులు ఆయిళ్ల శ్రీనివాస్ గౌడ్, ఆమనగల్ మార్కెట్ కమిటీ చైర్మన్ గీత నరసింహ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. వారు కూడా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి ఆశీర్వాదాలుపొందారు.నాయకుల రాకతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది. స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై వారికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా భక్తులతో కలసి కొంతసేపు నాయకులు గడిపి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
మైసిగండి మైసమ్మ ఆలయం ప్రాంతీయంగా ఎంతో ప్రాచుర్యం పొందిన దేవస్థానం కాగా, ప్రత్యేక రోజుల్లో వేలాది మంది భక్తులు ఇక్కడికి తరలివస్తుంటారు. నాయకుల దర్శనం సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తుల్లో ప్రత్యేక ఉత్సాహం కనిపించింది.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:

