Sravanamasam 2026 : ఆగస్టు 13 నుంచి పవిత్ర శ్రావణ మాసం ప్రారంభం కానుండటంతో తెలుగు రాష్ట్రాల్లో శుభకార్యాల హడావుడి మొదలుకానుంది. సెప్టెంబర్ 11 వరకు కొనసాగే ఈ మాసంలో వివాహాలు, గృహప్రవేశాలు, నిశ్చితార్థాలు మరియు శ్రావణ శుక్రవారం వ్రతాల వంటి అనేక మంగళకరమైన కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించేందుకు పంచాంగకర్తలు, పురోహితులు ముహూర్తాలు నిశ్చయించారు.
ముఖ్యంగా ఆగస్టు నెలలో 16, 17, 20, 21, 22, 23, 26, 27, 28, 29, 30 తేదీలతో పాటు సెప్టెంబర్ 3, 4, 5, 8, 10 తేదీలలో అత్యంత బలమైన శుభ ముహూర్తాలు అందుబాటులో ఉన్నాయి. ఈ శ్రావణ సీజన్‌లో రెండు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10 వేలకు పైగా వివాహాలు జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
Marriage పె పెళ్లిళ్లతో పెరగనున్న కళ్యాణమండపాలు, వ్యాపారాల సందడి
శ్రావణ మాసంలో రానున్న వరుస ముహూర్తాల కారణంగా కళ్యాణమండపాలు, ఈవెంట్ మేనేజ్‌మెంట్ సేవలు మరియు పురోహితులకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. చాలామంది ముందుగానే మండపాలను, క్యాటరింగ్ సేవలను బుక్ చేసుకోవడంతో పాటు వస్త్ర వ్యాపారాలు, పసిడి, పూల మార్కెట్లు ఇప్పటికే కస్టమర్లతో రద్దీగా మారాయి. ఆషాఢ మాసంలో శుభకార్యాలకు విరామం లభించడంతో, ఈ శ్రావణ మాసం ప్రారంభం కాగానే ముహూర్తాల సందడితో పాటు ఆధ్యాత్మిక వాతావరణం నెలకొననుంది. కుటుంబాలన్నీ మంగళకర వేడుకల ఏర్పాట్లలో బిజీగా మారి, పండుగ వాతావరణంలో మునిగి తేలేందుకు సిద్ధమవుతున్నాయి.
లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న విజయ్ దేవరకొండ

