Vijay Deverakonda: హైదరాబాద్ నగరంలో బోనాల పండుగ ఉత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. భాగ్యనగరంలోని ప్రసిద్ధ అమ్మవారి ఆలయాలన్నీ భక్తుల సందడితో కిటకిటలాడుతున్నాయి.
ఈ వేడుకల సందర్భంగా పాతబస్తీలోని ప్రసిద్ధ లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారిని టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ దర్శించుకున్నారు.
Read Also :Avika Gor : 104 జ్వరంతో షూటింగ్ సెట్ లో హీరోయిన్..!

Vijay Deverakonda: ప్రత్యేక పూజల్లో టాలీవుడ్ ప్రముఖులు
విజయ్ దేవరకొండతో పాటు ఆయన సోదరుడు నటుడు ఆనంద్ దేవరకొండ, ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ‘అర్జున్ రెడ్డి’ కాంబినేషన్ హీరో, డైరెక్టర్ ఇద్దరూ కలిసి ఆలయానికి రావడంతో అక్కడి వాతావరణం పండుగ శోభతో పాటు మరింత సందడిగా మారింది. తమ ప్రియతమ కథానాయకుడిని నేరుగా చూసేందుకు, ఫోటోలు తీసేందుకు స్థానిక యువత, అభిమానులు పోటీ పడటంతో లాల్ దర్వాజా ఆలయ ప్రాంగణంలో కాసేపు కోలాహలం నెలకొంది. ప్రతి ఏటా హైదరాబాద్‌లో జరిగే లాల్ దర్వాజా బోనాల ఉత్సవాల్లో సామాన్య భక్తులతో పాటు సినీ, రాజకీయ రంగానికి చెందిన ప్రముఖులు అమ్మవారి ఆశీస్సులు అందుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
'టాక్సిక్' ట్రైలర్ లాంచ్‌లో రాధికా పండిట్‌పై యష్ ఆసక్తికర వ్యాఖ్యలు

