Weather update:బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర ఉపరితల ఆవర్తనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో రాబోయే 48 గంటల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
ఉరుములు మెరుపులతో పాటు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరికలు జారీ చేసింది.
Telangana heat weather: ఎండిపోతున్న పంటలు.. ఆందోళనలో రైతన్నలు
Rains to start from the 15th of this month.
ఏయే జిల్లాలకు రెడ్ అలర్ట్
ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాలకు ఎల్లో అలాగే ఆరెంజ్ అలర్ట్ ప్రకటించగా, తెలంగాణలోని సూర్యాపేట, వరంగల్ జిల్లాలకు వర్షం పిడుగుపాటు హెచ్చరికలు జారీ అయ్యాయి. నైరుతి రుతుపవనాలు తిరోగమనం మొదలుపెట్టడంతో ఈ వర్షాలు పడనున్నాయి.
Weather update:తుఫాను ముప్పు పొంచి ఉందా?
ఈ నెల 13న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇది బలపడి తుఫానుగా మారే అవకాశం ఉంది. ఈ అల్పపీడన ప్రభావంతో అక్టోబర్ 15 నుంచి రాష్ట్రంలో వర్షాలు ప్రారంభమయ్యే సూచనలున్నాయి. ప్రస్తుతం అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
Epaper: epaper.vaartha.com

