El Nino Effect:తెలంగాణలో ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉండనుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
దీనివల్ల అక్టోబర్ నెలలోనూ ఎండలు దంచికొడుతున్నాయి. ప్రజలు తీవ్రమైన ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. ఉత్తర మధ్య తెలంగాణ ప్రాంతాల నుంచి నైరుతి రుతుపవనాలు పూర్తిగా నిష్క్రమించాయి. రానున్న 2 నెలల పాటు ఇదే వాతావరణం కొనసాగే అవకాశం ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ మహబూబ్ నగర్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 35 నుంచి 36 డిగ్రీలుగా నమోదు అవుతున్నాయి. రాబోయే రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం చాలా తక్కువగా ఉందని శ్రీనివాసరావు స్పష్టం చేశారు.
Water scarcit: భాగ్యనగరాన్ని వణికిస్తున్న దప్పిక ముప్పు
The coming summer
శీతాకాలంలోనూ తగ్గేదేం లేని ఎండలు – అసౌకర్యంగా మారిన వాతావరణం
శీతాకాలంలోనూ చలి తగ్గి ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉంది. ఎల్నినో ప్రభావం వల్ల ఈసారి వింటర్ సీజన్ లో కూడా సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి. గాల్లో తేమ శాతం అధికంగా ఉండటం వల్ల ఉక్కపోత మరింత పెరుగుతోంది. అక్టోబర్ నవంబర్ నెలల్లో కూడా ఎండల ప్రభావం తగ్గే సూచనలు కనిపించడం లేదు. ఈశాన్య రుతుపవనాల ద్వారా మన రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం తక్కువని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో బలమైన అల్పపీడనాలు ఏర్పడితే తప్ప వర్షాలు పడవు. రానున్న 4 నుంచి 5 రోజుల వరకు ఎలాంటి వర్ష సూచన కనిపించడం లేదని అధికారులు పేర్కొన్నారు.
El Nino Effect:ప్రజలకు ఐఎండీ హెచ్చరికలు – రాబోయే రోజుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఈ వాతావరణ మార్పుల నుంచి ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున మధ్యాహ్న సమయాల్లో బయటికి వెళ్లకుండా ఉండటం మంచిది. ఒంట్లో నీటి శాతాన్ని కాపాడుకోవడానికి తగినన్ని పానీయాలు తీసుకోవాలి. రానున్న 2 నెలల పాటు వాతావరణ హెచ్చరికలను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలి. రైతులు సాధారణ ప్రజలు ఈ ప్రత్యేక వాతావరణ పరిస్థితులకు తగినట్లుగా తమ దినచర్యలను మార్చుకోవడం చాలా అవసరం.
Epaper: epaper.vaartha.com

