Telangana auto drivers:తెలంగాణ రాష్ట్రంలో ఆటో, క్యాబ్, లారీ అలాగే బస్సు రవాణా రంగ డ్రైవర్లు ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆ రాష్ట్ర ఆటో యాప్ ఆధారిత సంఘాల జెఏసి గట్టిగా డిమాండ్ చేసింది.
రవాణా రంగాన్ని నమ్ముకుని జీవిస్తున్న లక్షలాది కుటుంబాల సంక్షేమం కోసం ప్రత్యేకంగా ఒక డ్రైవర్ల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. హైదరాబాద్ లోని బషీర్‌బాగ్‌లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వం స్పందించకపోతే ఈ నెల ఇరవై మూడో తేదీ అర్ధరాత్రి నుండి రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మె చేపడతామని హెచ్చరించారు.ప్రభుత్వం తమ సమస్యలపై సానుకూలంగా స్పందించకపోతే ఈ నెల 23వ తేదీ అర్ధరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మె చేపట్టనున్నట్లు హెచ్చరించింది.
Read also: Professor jayashankar jayanthi: వాడ వాడల్లో జయశంకర్ జయంతి
Auto and cab drivers warn of an indefinite strike.
డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటుతో పాటు ప్రధాన డిమాండ్లు
రోజురోజుకూ విపరీతంగా పెరుగుతున్న ఇంధన ధరలతో పాటు ఆన్‌లైన్ చలాన్ల భారం మోయలేకుండా ఉందని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇతర రంగాల కార్మికులకు అందుతున్నట్లుగా ప్రాణాలను పణంగా పెట్టి సేవలు అందిస్తున్న వాహన చోదకులకు సామాజిక భద్రత కల్పించాలని జెఏసి కోరింది. ప్రతి డ్రైవర్‌కు ప్రభుత్వ ఖర్చుతో ఉచిత ఆరోగ్య బీమా, ప్రమాద బీమా అలాగే పెన్షన్ సౌకర్యం కల్పించాలి. ట్రాఫిక్ ఈ-చలాన్ల భారం తగ్గించి పాత బకాయిలలో రాయితీలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత నిత్యావసరాల ధరలకు అనుగుణంగా ఆటో మీటర్ ఛార్జీలను సవరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Telangana auto drivers:సమ్మె నివారణకు ప్రభుత్వ చర్చలు
డ్రైవర్లు చేపడుతున్న ఈ న్యాయమైన పోరాటానికి బీఆర్ఎస్ పార్టీతో పాటు పలు కార్మిక సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. అసెంబ్లీలో ఇచ్చిన హామీలను నెరవేర్చి డ్రైవర్లకు నెలవారీ ఆర్థిక సాయం అందించాలని కోరారు. ప్రభుత్వం సకాలంలో స్పందించి చర్చలు జరపకపోతే రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయే ప్రమాదం ఉందని నాయకులు తెలిపారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా ముఖ్యమంత్రి రవాణా శాఖ మంత్రి వెంటనే జోక్యం చేసుకుని సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.
Epaper: epaper.vaartha.com

