విశాఖలో గూగుల్ డేటా సెంటర్
Google Data Center : ఆంధ్రప్రదేశ్‌కు మరో భారీ పెట్టుబడి రాబోతోంది. ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ విశాఖపట్నంలో భారీ డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది.
ఈ మెగా ప్రాజెక్టుకు ఈ నెల 28న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్ కూడా హాజరుకానున్నారు.
భారీ పెట్టుబడి ప్రాజెక్ట్
గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఇన్ఫోటెక్, అదానీ ఇన్‌ఫ్రా కలిసి ఈ ప్రాజెక్టును చేపట్టనున్నాయి. ఈ డేటా సెంటర్ కోసం సుమారు 15 బిలియన్ డాలర్లు, అంటే దాదాపు రూ.1.27 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టనున్నారు. దీన్ని 1000 మెగావాట్ల సామర్థ్యంతో అభివృద్ధి చేయాలని ప్రణాళిక సిద్ధం చేశారు.
Read Also:Patriot Trailer Release: ఇద్దరు సూపర్ స్టార్ల విశ్వరూపం..'పేట్రియాట్' ట్రైలర్ రిలీజ్
Google Data Center విశాఖకు టెక్ హబ్ గుర్తింపు
ఈ ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విశాఖ పరిధిలోని తర్లువాడ, రాంబిల్లి, అడవివరం ప్రాంతాల్లో 601.4 ఎకరాల భూమిని కేటాయించింది. ప్రస్తుతం తర్లువాడలో భూమి చదును చేసే పనులు కొనసాగుతున్నాయి. 2028 జులై నాటికి ఈ ప్రాజెక్టును పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీని ద్వారా విశాఖ నగరం టెక్ హబ్‌గా ఎదగడంతో పాటు వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:

