Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఈ నెల 30, 31 తేదీల్లో తిరుమలలో 'వరుణయాగం'!

ఈ నెల 30, 31 తేదీల్లో తిరుమలలో 'వరుణయాగం'!

వార్త 1 week ago

TTD Varuna Yagam: ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్న వాతావరణ నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో, తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది.

రాష్ట్రంలో పంటలు పండి, సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలందరూ క్షేమంగా ఉండాలని కోరుతూ ఈ నెల 30, 31 తేదీల్లో ధర్మగిరి వేదపాఠశాలలో వరుణయాగాన్ని నిర్వహించనుంది.

Read Also :TTD Srivari Seva Training:భక్తుల సేవలో కొత్త విప్లవం: టీటీడీ 43 రోజుల 'ట్రైన్ ది ట్రైనర్స్' పూర్తి!

TTD Varuna Yagam: యాగానికి సంబంధించిన ప్రధాన వివరాలు

తిరుమల ధర్మగిరిలోని శ్రీ వేంకటేశ్వర వేద విజ్ఞానపీఠం (వేదపాఠశాల) ప్రాంగణంలో ఈ నెల 30 మరియు 31వ తేదీలలో రెండు రోజుల పాటు ఈ వరుణయాగం జరగనుంది. టీటీడీ అదనపు ఈవో వెంకటయ్య చౌదరి ఇప్పటికే యాగ నిర్వహణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ప్రత్యక్షంగా పరిశీలించి పూర్తి చేశారు. ఎల్‌నినో ప్రభావం వల్ల తీవ్రమైన వర్షాల కొరత ఏర్పడి కరువు పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో, దైవానుగ్రహం కోసం టీటీడీతో పాటు పలు దేవాలయాలు, ప్రజలు ప్రత్యేక పూజలు, యాగాలు నిర్వహిస్తున్నారు.

ఈ శ్రావణ శుక్రవారం రోజు లక్ష్మీదేవి కటాక్షం పొందాలంటే ఇలా చేయండి!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha