Sravana Sukravaram: ఆధ్యాత్మికతకు, భక్తి పారవశ్యానికి శ్రావణమాసం అత్యంత ప్రత్యేకమైనది. ఈ మాసంలో వచ్చే శుక్రవారాల్లో నిర్వహించే శ్రీ మహాలక్ష్మి పూజ కుటుంబంలో ఐశ్వర్యం, శాంతి, ఐక్యతను నింపుతుందని భక్తుల విశ్వాసం.
వరలక్ష్మీ వ్రతాన్ని పూర్తిస్థాయిలో చేసుకోలేని వారు కూడా శ్రావణ శుక్రవారాల్లో సాధారణ లక్ష్మీ పూజను భక్తి శ్రద్ధలతో ఆచరించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందవచ్చు.
Read Also :Sravanamasam 2026 : నేటి నుంచి శ్రావణ మాసం.. ఏం చేయాలో తెలుసా ?
Sravana Sukravaram: శ్రావణ శుక్రవార పూజా విధానం & ముఖ్యమైన నియమాలు

సూర్యోదయానికి ముందే నిద్రలేచి అభ్యంగన స్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలు ధరించాలి. ఇంటి ముందు అందమైన ముగ్గులు వేసి, గుమ్మాలకు మామిడి తోరణాలు, పూలమాలలతో అలంకరించి మహాలక్ష్మిని ఆహ్వానించాలి. పూజా పీఠంపై లక్ష్మీదేవి చిత్రపటాన్ని ఉంచి, కలశంలో నీరు, పసుపు, కుంకుమ, బియ్యం, నాణేలు వేసి మామిడి ఆకులు, పసుపు రాసిన కొబ్బరికాయతో కలశ స్థాపన చేసుకోవాలి. ముందుగా విఘ్నేశ్వర ప్రార్థన చేసి, అనంతరం అమ్మవారిని ఆవాహనం చేయాలి. షోడశ లేదా పంచోపచార పూజ చేసి, 'శ్రీ మహాలక్ష్మి అష్టోత్తర శతనామావళి' జపించి పాయసం లేదా చక్కెర పొంగలిని నైవేద్యంగా సమర్పించి హారతి ఇవ్వాలి. పూజ పూర్తయిన తర్వాత ముత్తైదువులకు పసుపు, కుంకుమ, తాంబూలం, వస్త్రాలను వాయనంగా అందించి ఆశీస్సులు తీసుకోవాలి.

