Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఈ సాలా కప్ నమ్దే.. వరుసగా రెండోసారి ఛాంపియన్‌గా ఆర్‌సీబీ

ఈ సాలా కప్ నమ్దే.. వరుసగా రెండోసారి ఛాంపియన్‌గా ఆర్‌సీబీ

వార్త 3 weeks ago

RCB IPL Champion : ఐపీఎల్ 2026 ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించి వరుసగా రెండోసారి ఛాంపియన్‌గా నిలిచింది.

లక్ష్య ఛేదనలో విరాట్ కోహ్లీ అజేయంగా 75 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. కీలక సమయంలో బాధ్యతాయుతంగా ఆడిన కోహ్లీ మరోసారి తన అనుభవాన్ని నిరూపించాడు.

బౌలర్ల అద్భుత ప్రదర్శన

టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్న ఆర్‌సీబీ బౌలర్లు మ్యాచ్‌ను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్‌లను త్వరగా ఔట్ చేసి గుజరాత్‌ను ఒత్తిడిలోకి నెట్టారు. రసిఖ్ సలామ్ మూడు వికెట్లతో మెరిసిపోగా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్ చెరో రెండు వికెట్లు తీశారు. వాషింగ్టన్ సుందర్ ఒంటరి పోరాటంతో అజేయ అర్ధశతకం సాధించినప్పటికీ గుజరాత్ 155/8 స్కోరుకే పరిమితమైంది.

Read Also :Samsung: ఏఐతో పెరిగిన లాభాలు.. ఉద్యోగులతో పంచుకుంటున్న శాంసంగ్

 RCB IPL Champion

చరిత్రలో నిలిచిన ఆర్‌సీబీ

156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్‌సీబీకి వెంకటేశ్ అయ్యర్ వేగవంతమైన ఆరంభాన్ని అందించాడు. అనంతరం కోహ్లీ ఇన్నింగ్స్‌ను చక్కగా నిర్మించాడు. మధ్యలో కొన్ని వికెట్లు పడినప్పటికీ టిమ్ డేవిడ్, జితేష్ శర్మల సహకారంతో లక్ష్యాన్ని 12 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది.

ఈ విజయంతో ఐపీఎల్ చరిత్రలో వరుసగా టైటిల్‌ను నిలబెట్టుకున్న మూడో జట్టుగా ఆర్‌సీబీ నిలిచింది. గతంలో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మాత్రమే ఈ ఘనత సాధించాయి. తొలి టైటిల్ కోసం 18 సీజన్లు ఎదురుచూసిన బెంగళూరు, ఇప్పుడు రెండేళ్లలో రెండు కప్పులు గెలిచి తన శకాన్ని కొనసాగిస్తోంది. గుజరాత్ టైటాన్స్ ఫైనల్లో ఓడిపోయినా మొత్తం సీజన్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచి ప్రశంసలు అందుకుంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

ఫీచర్ ఫోన్ యూజర్లకు జియో, ఐటెల్ అదిరిపోయే ఆఫర్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha