Health Tips: పాలు ఆరోగ్యానికి ఎంతో మంచివి, అందులో క్యాల్షియం మరియు ప్రొటీన్లు సమృద్ధిగా ఉంటాయి. కానీ కాలేయ సంబంధిత సమస్యలు లేదా పచ్చకామెర్లతో బాధపడేవారు పాలకు దూరంగా ఉండాలి.
పాలలో ఉండే కొవ్వు, ప్రొటీన్లను అరిగించడం బలహీనమైన కాలేయానికి కష్టమవుతుంది, దీనివల్ల కామెర్ల తీవ్రత పెరుగుతుంది. అలాగే ‘ఫ్యాటీ లివర్’ సమస్య ఉన్నవారి కాలేయంలో కొవ్వు నిల్వలు ఇప్పటికే ఎక్కువగా ఉంటాయి కాబట్టి, ఫుల్ క్రీమ్ పాలు తాగితే కాలేయంలో కొవ్వు మరింత పెరుగుతుంది. వీరు కేవలం వైద్యుల సలహా మేరకు కొవ్వు లేని పాలు మాత్రమే స్వల్పంగా తీసుకోవాలి.
Read Also : Forgetting : మీరు చిన్న..చిన్న విషయాలు కూడా మర్చిపోతున్నారా?
It is dangerous for people with these conditions to drink milk!
Health Tips: లాక్టోజ్ ఇన్టోలరెన్స్, అజీర్తి, చర్మ సమస్యలు
కొందరి శరీరంలో పాలను జీర్ణం చేసే ఎంజైమ్‌లు సరిగ్గా ఉండవు, దీనినే ‘లాక్టోజ్ ఇన్టోలరెన్స్’ అంటారు. వీరు పాలు తాగిన వెంటనే కడుపునొప్పి, కడుపు ఉబ్బరం, గ్యాస్, వాంతులు లేదా విరేచనాలతో బాధపడతారు. వీరికి బాదం పాలు లేదా సోయా పాలు ప్రత్యామ్నాయంగా ఉపయోగపడతాయి. అలాగే తరచుగా గ్యాస్, అసిడిటీ, అజీర్తితో బాధపడేవారు రాత్రి వేళల్లో మీగడ పాలు తాగితే జీర్ణవ్యవస్థ మందగిస్తుంది. అంతేకాకుండా తీవ్రమైన మొటిమలు, జిడ్డు చర్మం ఉన్నవారు పాలు ఎక్కువగా తాగితే, అందులోని హార్మోన్ల వల్ల చర్మంలో జిడ్డు ఎక్కువై మొటిమలు మరింత తీవ్రమవుతాయి. కాబట్టి ఈ సమస్యలు ఉన్నవారు డాక్టర్‌ను సంప్రదించి తగిన నిర్ణయం తీసుకోవడం మంచిది.

