Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఈ 'సుస్తీ'కి ఆంక్షలతో సరా!

ఈ 'సుస్తీ'కి ఆంక్షలతో సరా!

వార్త 2 weeks ago

Cough syrup : ఉన్న ఫళంగా ఒక్కసారి ప్రభుత్వాలకు ఔషధాలు, వైద్య విధానాలు, చికిత్సలు, వాటి వాల్ల కలిగే కష్టనష్టాలు వికటించడాలు, నిషేధాలు గుర్తొస్తుంటాయి.

గత అక్టోబర్లో జరిగిన సంఘటనలపై చర్యలు కొనసాగింపుగా దగ్గు మందు విక్రయాల విషయంలో కేంద్ర ప్రభుత్వంమరోసారి తుది మార్గదర్శకాలు విడుదల చేసింది. దగ్గు సిరప్లను కొనేందుకు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తప్పనిసరి చేసింది. ఆమేరకు జూన్ 16, 2026న 1945 డ్రగ్స్ రూల్స్ ను కేంద్రఆరోగ్య మంత్రిత్వశాఖ సవరించింది. గత ఏడాది మధ్యప్రదేశ్లో 20 మంది పిల్లలు తమిళనాడుకు చెందిన శ్రీసన్ కంపెనీ ఉత్పత్తి చేస్తున్న 'కోల్డిఫ్' దగ్గు సిరప్ తాగి 22మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. అప్పట్లోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ కొన్ని మార్గదర్శకాలు విడుదల చేస్తూ డాక్టర్ చీటి ఉంటే తప్ప మందుల షాపులలో దగ్గు మందు విక్ర యాలను నిషేధించింది. అదే సందర్భంగా దగ్గు సిరప్లను షెడ్యూల్ 'కె' డ్రగ్స్ జాబితాలోని క్లాస్ ఆఫ్ డ్రగ్స్ సెక్షన్ 75లో ఎంట్రీ మినహాయింపుల నుంచి తొలగించింది. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకపోయినా మెడికల్ షాపులు విని యోగదారులు అడిగితే సదరు కాఫ్సిరప్లను విక్రయించే సౌకర్యం ఉండేది. కొన్ని సందర్భాలలో మందుల షాపులు కొన్న దగ్గు సిరప్ల ద్వారా నయమయ్యేది. వికటిస్తే జరి గిందేమిటో తెలిసిందే. కీలెరిగి వాత పెట్టాల్సిన ప్రభుత్వం తయారీ దారుల నాణ్యతా ప్రమాణాలను పాటించేలా చేయలేకపోయాయి. ఆయా సంస్థలపై కేసులు పెట్టి చేతులు దులుపుకున్నాయి. ఆకారణంచేతనే అనుకుంటా భారత్లో తయారీ జరిగే దగ్గు మందుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రజల్ని హెచ్చరించింది. నాసిరకపు దగ్గు మందులతో ప్రాణాలు గాలిలో కలిసిపోతుంటాయి. ఇలాంటి ఉదంతాలు మరింకెక్కడా జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన 'హు' సంస్థ కూడా కనీసం మన దేశవ్యాప్తంగానైనా తనిఖీలు చేపట్ట లేదు.

Read Also : Tea & Coffee : నిద్ర లేవగానే టీ, కాఫీలు తాగుతున్నారా?

 Cough syrup

Cough syrup : ఆరోగ్య భద్రత ప్రజ లందరికీ అవసరమే

కేంద్ర ప్రభుత్వం అప్పట్లోనే మినహాయింపు జాబితా నుంచి తొలగించినా, డిసెంబరు నెలలో ఆ విషయాన్ని రీషెడ్యూల్ చేసి కొత్త రూలుకు సంబంధించిన ముసాయి దా నిబంధనలను విడుదల చేసింది. దీనిని ప్రజాభిప్రా యానికి పెట్టడంతో తుది మార్గదర్శకాలకు ఏడు నెలలు పట్టింది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ జాయింట్ సెక్రటరీ తాజాగా తుది మార్గదర్శకాలను అధికారికంగా జారీ చేశారు. ఇంత దాకా వెయ్యి మంది జనాభా కన్నా తక్కువ ఉన్న గ్రామాల్లో కొన్ని కంపెనీల దగ్గు మందులను విక్రయించడానికి ఔషధ లైసెన్సు లేవి దుకాణాలకు అనుమతి ఉంది. ఇప్పుడలాంటి మినహాయింపులు రద్దయ్యాయి. అందుచేత ఆ ప్రాంతాలకు తయారీదారులు సదరు దగ్గు మందులు పంపిణీ చేయరు. ప్రజలకు ఇదొక రకమైన అసౌకర్యం. అయినా ప్రజల ఆరోగ్యరీత్యా వైద్యుని చీటీ ద్వారానే దగ్గు మందుల వాడకం మంచిదే. కనుక ప్రాణా పాయం సంభవించదు. ఈరకమైన ఆరోగ్య భద్రత ప్రజ లందరికీ అవసరమే. దీనిని బట్టి ప్రతి చిన్న పల్లెటూరిలో నూ లైసెన్స్ కలిగిన మందుల కంపెనీ ఉండాల్సిందే. దగ్గు మందుల తయారీదార్లు రిటైల్గా కొని వాడేవారు సైతం ఎంతో జాగరూకత వహించాలి. దగ్గుమందే కాదు ఏ ఇతర సిరప్ ఆధారిత ఔషధాలనీ డాక్టర్ చీటీ లేకుండా మందుల షాపులు నేరుగా వినియోగదారునికి అమ్మే అవకాశంలేకుండా ప్రభుత్వ చర్యలు మంచి దారినే ఎన్నుకున్నాయి. కొన్ని నిర్దిష్ట ప్రమాణాలకు లోబడి తయారు చేయాల్సిన దగ్గు మందులు నాణ్యత కోల్పోయినందునే ఎంతోమంది పసి వాళ్ల ప్రాణాలు బలికొన్నాయి. కొన్ని సంస్థలు తయారు చేసిన దగ్గు మందుల్లో డై ఎథిలీన్ గ్లైకాల్, ఇథిలీన్ గ్లైకాల్ వంటి విషపూరిత పదార్థాలు కలవడంతో చిన్నారుల్లో మూత్రపిండాల వైఫల్యం, శ్వాసకోస సమస్యలు ఏర్పడ్డాయి. ప్రపంచవ్యాపిత ఔషధ భద్రతకు సంబంధించిన విషయ మైనా దుర్ఘటనలు జరిగినప్పుడు అతిగా స్పందించి ఆనక వాటి సంగతి మరచిపోవడం ప్రపంచ ఆరోగ్య సంస్థకు కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ మంచిది కాదు.

 Cough syrup

ఔషధ నియంత్రణ వ్యవస్థకు చెదలు

ఇటీవల కాలంలో నాసిరకం దగ్గుమందులే వివిధ దేశాల్లో పసివాళ్ల ప్రాణాలను కబళించిన సంఘటనలు జరిగాయి. ఔషధ తయారీరంగంలో భారత్ంత ఎదిగినా ఔషధ నియంత్రణ వ్యవస్థ పనితీరుకు చెదలు పట్టినట్లే ఉంది. 2022లో ఆఫ్రికాలోని గాంబియాలో భారత్లో తయారైన కొన్ని దగ్గు సిరప్ లు వాడి డజన్ల సంఖ్యలో చిన్నారులు ప్రాణాలు విడి చారు. ఉజ్బెకిస్థాన్లో కూడా భారతీయ తయారీదగ్గుమందు సేవించి చిన్నారులు మృతిచెందడం విచారకరం. కేవలం దగ్గు మందు తయారీలోనే కలుషిత సమస్య వస్తే ఎన్నో ప్రాణాధార మందుల తయారీకి నెలవుగా ఉన్న భారత్ ఔషధ నియంత్రణ మీద పట్టుకోల్పోతోందా అనే అను మానం రాకమానదు. గతకొన్నేళ్లుగా దగ్గు సిరప్లకే ప్రపం చవ్యాప్తంగా వందలాది మంది పసివాళ్లు బలైపోవడం అందున భారతీయ సిరప్ వలనే అలా కావడం భారత్ ప్రతిష్టకు అవమానకరమే. ఎవరు సేవించినా, ఎక్కడవార యినా కలుషిత మందులకు బలైపోతే, ఆమందుల తయారీదారు శిక్షార్హులే. 2025 మధ్యప్రదేశ్లో కలుషిత మయిన 'కోల్డ్రిఫ్' దగ్గు మందు సేవించిన 22 మంది చిన్నారుల మృతికి కారణమైన సంస్థపై ఇంకా కేసు నడుస్తోంది. ఆ ఔషధ పరీక్షలో డై ఎథిలీన్ గ్లెకాల్ వంటి విష పూరిత రసాయనాలున్నట్లు తేలింది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలలో వైద్యుల సలహలేకుండా ఔషధ వినియోగం జరుగుతోందని కేంద్రప్రభుత్వం ఏనాడో గుర్తించినా వాటిపై కఠిన చర్యలు తీసుకోవడంలో విఫలమైంది. దేశవ్యాప్తంగా ఔషధ పరిశ్రమపై కఠిననిఘా, తరచు తనిఖీలు, ప్రతి బ్యాచ్ కు ప్రత్యేక నాణ్యతా పరీక్షలు జరుగుతుంటే నాసి రకం, ఔషధపంపిణీకి అడ్డుకట్ట వేయడం సాధ్యమౌతుంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

మహిళలకు నిద్ర కాస్త ఎక్కువ అవసరం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha