Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఈ విధంగా తెలంగాణలో ల్యాండ్ వాల్యూ పెంపు !!

ఈ విధంగా తెలంగాణలో ల్యాండ్ వాల్యూ పెంపు !!

వార్త 2 months ago

Telangana Land Value : తెలంగాణ వ్యాప్తంగా భూముల కొనుగోలుదారులు, రియల్ ఎస్టేట్ రంగానికి కీలకమైన మార్పు చోటుచేసుకోబోతోంది. రాష్ట్రంలో సవరించిన భూముల కొత్త మార్కెట్ విలువలు (ల్యాండ్ మార్కెట్ వాల్యూ) రేపటి నుంచే అధికారికంగా అమల్లోకి రానున్నాయి.

దీని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ భూముల కనీస ధరను ఎకరాకు రూ. 2.75 లక్షలుగా ఖరారు చేసింది. అదేవిధంగా, గ్రేటర్ హైదరాబాద్ (GHMC) పరిధిలో వ్యవసాయ భూమి కనీస ధరను ఎకరాకు రూ. 15 లక్షలుగా నిర్ణయించింది. ఇక ఐటీ కారిడార్ మరియు గ్రేటర్ పరిధిలోనే అత్యంత డిమాండ్ ఉన్న ప్రాంతమైన ఖాజాగూడలో రాష్ట్రంలోనే గరిష్ఠంగా ఎకరం భూమి మార్కెట్ విలువను రికార్డు స్థాయిలో రూ. 30 కోట్లుగా ప్రభుత్వం అధికారికంగా పేర్కొంది.

Read Also : కాంగ్రెస్ గెలుపే లక్ష్యం!

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో చదరపు గజాల వారీగా కొత్త ధరలు

కేవలం వ్యవసాయ భూములే కాకుండా నివాస స్థలాలు (ప్లాట్లు), కమర్షియల్ స్థలాల కనీస ధరలను కూడా చదరపు గజాల (Square Yards) ప్రాతిపదికన ప్రభుత్వం భారీగా సవరించింది. కొత్త రేట్ల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో చదరపు గజానికి కనీస ధర రూ. 600 గా నిర్ణయించగా, మున్సిపాలిటీల్లో అది రూ. 1,000 కి చేరింది. ఇక మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో చదరపు గజం కనీస ధర రూ. 1,500 కాగా, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) పరిధిలో ఈ కనీస ధరను రూ. 2,000 గా ఖరారు చేశారు. ఈ మార్కెట్ విలువల పెంపు వల్ల రేపటి నుంచి భూముల రిజిస్ట్రేషన్ చార్జీలు, స్టాంప్ డ్యూటీ భారం మరింత పెరగనుంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

పాలమూరుకు సీఎం రేవంత్ రెడ్డి.. రెండ్రోజుల పర్యటన షెడ్యూల్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha