Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కాంగ్రెస్ గెలుపే లక్ష్యం!

కాంగ్రెస్ గెలుపే లక్ష్యం!

వార్త 1 week ago

Thopaji Ananth Kishan Congress: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చారిత్రాత్మక గెలుపే లక్ష్యంగా ప్రతీ కాంగ్రెస్ కార్యకర్త, నాయకుడు సమన్వయంతో, అంకితభావంతో పనిచేయాలని టీపీసీసీ (TPCC) ప్రధాన కార్యదర్శి తోపాజి అనంత్ కిషన్ పిలుపునిచ్చారు.

బుధవారం సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సదాశివపేట పట్టణ, మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా తోపాజి అనంత్ కిషన్ నియమితులైన అనంతరం జరిగిన మొట్టమొదటి అధికారిక సమావేశం ఇదే కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా సదాశివపేట కాంగ్రెస్ శ్రేణులు తోపాజి అనంత్ కిషన్, సీడీసీ (CDC) చైర్మన్ రామ్‌రెడ్డిలను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు.

Read Also: Janasena Press Meet : తెలంగాణ ప్రజలను ఉద్దేశించి చెడుగా మాట్లాడలేదు - పవన్ కళ్యాణ్ క్లారిటీ

సమావేశంలో తోపాజి అనంత్ కిషన్(Thopaji Ananth Kishan Congress) మాట్లాడుతూ.. సదాశివపేట మున్సిపాలిటీలో నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లు, వార్డు ఇన్‌ఛార్జ్‌లు అందరూ విభేదాలను పక్కనబెట్టి సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. ఎవరి వార్డు పరిధిలో వారు నిరంతరం అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలవని వార్డులు ఉంటే, దానికి ఆయా వార్డు ఇన్‌ఛార్జ్‌లదే పూర్తి బాధ్యత అవుతుందని ఆయన హెచ్చరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలోకి, ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కోరారు. ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ బలమైన నేత జగ్గారెడ్డి, డీసీసీ (DCC) అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి సారథ్యంలో సంగారెడ్డి నియోజకవర్గంతో పాటు జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా ప్రతీ ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు.

ఈ ప్రతిష్టాత్మక మున్సిపల్ సమీక్షా కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మునిపల్లె సత్యనారాయణ, చిరు, వాసిం, సిద్దన్న, కంది కృష్ణ, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు శ్రీహరి, పట్నం సుభాష్, చోటు భాయ్ పాల్గొన్నారు. అలాగే సదాశివపేట మున్సిపల్ కౌన్సిలర్లు శంకర్ గౌడ్, నాగరాజు, నర్సింలు, విష్ణువర్ధన్ రెడ్డితో పాటు పట్టణ, మండల స్థాయి కాంగ్రెస్ అనుబంధ సంఘాల నాయకులు, ఉపాధ్యక్షులు, సోషల్ మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

అంతర్ జిల్లా దొంగలముఠా అరెస్ట్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha