Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఈఎంఐ కట్టలేదని ఫోన్ లాక్ చేస్తే బ్యాంక్‌కు ఫైన్!

ఈఎంఐ కట్టలేదని ఫోన్ లాక్ చేస్తే బ్యాంక్‌కు ఫైన్!

వార్త 2 weeks ago

RBI Loan Recovery: రుణగ్రహీతలను భయాందోళనలకు గురిచేస్తూ స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్‌లు లేదా ల్యాప్‌టాప్‌లను రిమోట్‌గా లాక్ చేసే రికవరీ ఏజెంట్ల ఆగడాలకు అడ్డుకట్ట వేస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సంచలన మరియు సమగ్ర మార్గదర్శకాలను విడుదల చేసింది.

సాంకేతిక ఆధారిత రికవరీ టూల్స్, యాప్‌లపై ఆర్బీఐ ఒక స్పష్టమైన నిబంధనావళిని తీసుకురావడం దేశంలో ఇదే తొలిసారి. రుణగ్రహీతల వ్యక్తిగత స్వేచ్ఛ, డేటా ప్రైవసీని కాపాడుతూ విడుదల చేసిన ఈ కొత్త నిబంధనలు జనవరి 1, 2027 నుండి అధికారికంగా అమలులోకి రానున్నాయి.

Read Also :Google Maps AI Features: గూగుల్ మ్యాప్స్‌లోకి మైండ్ బ్లాకింగ్ 'ఏఐ' ఫీచర్లు!

RBI కొత్త రిమోట్ డివైజ్ లాకింగ్ మార్గదర్శకాలు - ముఖ్యాంశాలు

  1. ఫైనాన్స్ చేసిన డివైజ్‌లకు మాత్రమే వర్తింపు:ఏదైనా ఇతర పర్సనల్ లోన్ లేదా క్యాష్ లోన్ కోసం రుణగ్రహీత వాడుతున్న వేరే మొబైల్‌ను లాక్ చేయడానికి వీల్లేదు. కేవలం సదరు ఫోన్/డివైజ్ కొనుగోలుకు మాత్రమే రుణం తీసుకున్న సందర్భాల్లోనే ఈ సాంకేతికతను ఉపయోగించాలి.
  2. 30 రోజుల కనీస వ్యవధి - దశలవారీ లాకింగ్:ఈఎంఐ (EMI) ఒక్క రోజు మిస్ అయిన వెంటనే డివైజ్‌ను లాక్ చేయడానికి వీల్లేదు. లోన్ అకౌంట్ బకాయి పడి కనీసం 30 రోజులు దాటిన తర్వాతే పరిమిత నియంత్రణలు ప్రారంభించాలి.
  3. 60 రోజుల తర్వాతే పూర్తి లాక్:రుణగ్రహీతకు అదనపు సమయం ఇచ్చేందుకు, డివైజ్ యొక్క పూర్తి స్థాయి లాక్‌ను 60 రోజుల బకాయి పూర్తయిన తర్వాత మాత్రమే అమలు చేయాల్సి ఉంటుంది.
  4. లాక్ చేసినా అందుబాటులో ఉండాల్సిన అత్యవసర సేవలు:ఫోన్ లాక్ చేసినప్పటికీ, రుణగ్రహీతకు క్రింది సేవలు నిరంతరాయంగా అందాలి:
    • ఇన్‌కమింగ్ కాల్స్ (Incoming Calls) & ఎస్‌ఎంఎస్‌లు (SMS).
    • అత్యవసర సహాయం కోసం SOS కమ్యూనికేషన్.
    • ఉద్యోగం/ఉపాధికి సంబంధించిన అత్యవసర ఫీచర్లు.
  5. వ్యక్తిగత డేటా రక్షణ (Data Privacy):రికవరీ యాప్‌లు రుణగ్రహీతల కాంటాక్ట్ లిస్ట్‌లు, ఫోటోలు, వీడియోలు, కాల్ లాగ్‌లు, ఎస్‌ఎంఎస్‌లు మరియు లొకేషన్ హిస్టరీని సేకరించడం లేదా దుర్వినియోగం చేయడంపై ఆర్‌బీఐ కఠిన నిషేధం విధించింది.
  6. ముందస్తు సమాచారం తప్పనిసరి:లోన్ మంజూరు చేసే సమయంలోనే ఈ నిబంధనలను విస్పష్టంగా తెలియజేయాలి. అలాగే డివైజ్ నియంత్రణ విధించే ముందు అభ్యర్థికి స్పష్టమైన ముందస్తు నోటీసు ఇవ్వాలి.
  7. 1 గంటలోపు అన్‌లాకింగ్ - లేదంటే గంటకు ₹250 పరిహారం:బాకీ మొత్తం చెల్లించిన 1 గంటలోపు డివైజ్‌ను ఆటోమేటిక్‌గా అన్‌లాక్ చేయాలి. ఒకవేళ నిర్ణీత సమయంలోగా ఆంక్షలు తొలగించకపోతే, బ్యాంకులు/రుణ సంస్థలు రుణగ్రహీతకు ఆలస్యమైన ప్రతి గంటకూ రూ. 250 చొప్పున పరిహారం (గరిష్టంగా బాకీ ఉన్న రుణ మొత్తానికి సమానంగా) చెల్లించాల్సి ఉంటుంది.

రైతులకు కేంద్రం బంపర్ ఆఫర్.. కేసీసీ లోన్ పెంపు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha