Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గూగుల్ మ్యాప్స్‌లోకి మైండ్ బ్లాకింగ్ 'ఏఐ' ఫీచర్లు!

గూగుల్ మ్యాప్స్‌లోకి మైండ్ బ్లాకింగ్ 'ఏఐ' ఫీచర్లు!

వార్త 2 weeks ago

Google Maps AI Feature,: దిగ్గజ టెక్ సంస్థ గూగుల్ తన ప్రాచుర్యం పొందిన 'గూగుల్ మ్యాప్స్' (Google Maps) యాప్‌ను కేవలం దారి చూపే నావిగేషన్ యాప్‌గానే కాకుండా, ప్రయాణాలను అత్యంత సులభతరం చేసే ఆల్-ఇన్-వన్ స్మార్ట్ అసిస్టెంట్‌గా తీర్చిదిద్దింది.

కృత్రిమ మేధ (AI) సాంకేతికతతో కూడిన సరికొత్త ఫీచర్లను గూగుల్ తాజాగా అందుబాటులోకి తెచ్చింది. ఇకపై గూగుల్ మ్యాప్స్ ద్వారానే దారితో పాటు హోటల్ బుకింగ్స్ చేసుకోవడం, ఇష్టమైన ఆహారాన్ని ఆర్డర్ చేయడం, ప్రయాణ ప్రణాళికలు రూపొందించుకోవడం మరింత సులభం కానుంది.

Read Also :Meta Muse Code: సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు పండగే: సొంతంగా కోడింగ్ రాసే 'మ్యూజ్ కోడ్' టూల్‌

Google Maps AI Features: గూగుల్ మ్యాప్స్ కొత్త ఏఐ ఫీచర్ల ముఖ్యాంశాలు

  1. 'ఆస్క్ మ్యాప్స్' (Ask Maps) ఫీచర్:ఈ ఫీచర్‌తో వినియోగదారులు సాధారణ భాషలోనే మ్యాప్స్‌ను ప్రశ్నలు అడగవచ్చు. ఉదాహరణకు "బీచ్‌కు దగ్గరలో కుటుంబంతో ఉండేందుకు బడ్జెట్ హోటల్ కావాలి" అని అడిగితే.. మ్యాప్స్ వెంటనే గదుల లభ్యత, ధరలు, వినియోగదారుల రివ్యూల ఆధారంగా సరైన సూచనలు చూపిస్తుంది.
  2. ఇష్టమైన వంటకాల లభ్యత & ఆర్డరింగ్:మీరు వెళ్లే మార్గమధ్యంలో మీకు కావలసిన వంటకం (Dish) ఎక్కడ లభిస్తుందో గుర్తించి, సదరు రెస్టారెంట్లు తెరిచి ఉన్నాయా లేదా అని సమాచారం ఇస్తుంది. అంతటితో ఆగకుండా, నచ్చిన వంటకాన్ని నేరుగా కార్ట్ (Cart) లో చేర్చుకునే సదుపాయం కూడా కల్పించారు.
  3. హిందీ భాషా సపోర్ట్ (Hindi Language Support):భారతీయ వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా హిందీ భాషను సపోర్ట్ చేసేలా అప్‌గ్రేడ్ చేశారు. ఇకపై ఇంగ్లిష్‌తో పని లేకుండా హిందీలోనే ప్రశ్నలు అడిగి రెస్టారెంట్లు, పర్యాటక ప్రాంతాల సమాచారం తెలుసుకోవచ్చు.
  4. పర్సనల్ ఇంటెలిజెన్స్ (Personal Intelligence):వినియోగదారుడి జీమెయిల్ (Gmail) లో ఉన్న విమాన టికెట్లు, హోటల్ బుకింగ్ వివరాలను విశ్లేషించి, దానికి తగినట్లుగా ప్రయాణ సూచనలు ఇస్తుంది. అంతేకాకుండా బస్సులు, మెట్రో రైళ్లు, రైళ్లు, ఫెర్రీ సేవల ప్రత్యక్ష సమాచారాన్ని అందిస్తుంది.

ఈ కొత్త ఏఐ ఫీచర్లు భారత్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా 150కి పైగా దేశాల్లో దశలవారీగా యూజర్లకు అందుబాటులోకి రానున్నాయి.

కేవలం రూ. 949 కే టైప్-సి ఛార్జింగ్‌తో 'ఏస్ 3 హీరా' లాంచ్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha