Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఈ-కేవైసీకి మరో రెండు రోజులే గడువు!

ఈ-కేవైసీకి మరో రెండు రోజులే గడువు!

వార్త 1 week ago

Telangana Ration Card: తెలంగాణలోని రేషన్ కార్డుదారులకు పౌర సరఫరాల శాఖ ముఖ్యమైన హెచ్చరిక జారీ చేసింది. రేషన్ కార్డులలో ఈ-కేవైసీ (e-KYC) నమోదు ప్రక్రియను పూర్తి చేయడానికి విధించిన జులై 31 గడువు మరి రెండు రోజుల్లో ముగియనుంది . అర్హులైన లబ్ధిదారులందరూ వెంటనే తమ ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

ఉచితంగా ఈ-కేవైసీ చేసుకునే విధానం

లబ్ధిదారులు ఈ క్రింది కేంద్రాల ద్వారా ఉచితంగా తమ వివరాలను సరిచూసుకోవచ్చు

  • సమీప రేషన్ దుకాణం: కుటుంబ సభ్యులందరూ తమ ఆధార్ కార్డులతో సమీపంలోని రేషన్ దుకాణానికి వెళ్లి బయోమెట్రిక్ (వేలిముద్రలు) ద్వారా ప్రక్రియను పూర్తి చేయవచ్చు.
  • మీ-సేవ కేంద్రాలు: బయోమెట్రిక్ పడని వారు లేదా వృద్ధులు, చిన్న పిల్లలు తమ సమీప మీ-సేవ కేంద్రాల్లో ఐరిస్ (కంటిపాప) వెరిఫికేషన్ ద్వారా ఈ-కేవైసీ ఉచితంగా చేసుకోవచ్చు.

Telangana Ration Card: గడువులోగా కేవైసీ చేసుకోకపోతే ఏమవుతుంది?

జులై 31లోగా ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయని లబ్ధిదారులపై పౌర సరఫరాల శాఖ చర్యలు తీసుకునే అవకాశముంది:

  • పేర్లు తొలగింపు: దీర్ఘకాలంగా ఈ-కేవైసీ చేయని వారి పేర్లను రేషన్ కార్డుల నుంచి తొలగించే అవకాశం ఉంది.
  • ఉచిత బియ్యం బంద్: రేషన్ కార్డు యాక్టివ్‌లో లేకపోతే ప్రభుత్వం అందించే ఉచిత బియ్యం కోటా నిలిచిపోతుంది.
  • సంక్షేమ పథకాలకు దూరం: రేషన్ కార్డు ప్రామాణికంగా ఇచ్చే ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఆసరా పింఛన్లు మరియు ఆరోగ్య భద్రత పథకాల ప్రయోజనాలను కోల్పోయే ప్రమాదం ఉంది.

కాబట్టి, ఇంకా ఈ-కేవైసీ పూర్తి చేయని లబ్ధిదారులు చివరి నిమిషంలో ఇబ్బందులు పడకుండా వెంటనే తమ సమీప రేషన్ షాపును సంప్రదించి ప్రక్రియను పూర్తి చేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు.

కస్టమర్లకు బిగ్ రిలీఫ్.. బుక్ చేసిన 4 గంటల్లోనే గ్యాస్ సిలిండర్ డెలివరీ!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha