TG Inter Supply Results 2026: తెలంగాణలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాసిన విద్యార్థులకు విద్యాశాఖ కీలక సమాచారం అందించింది.
ఈ నెల 10వ తేదీ లోపే ఫలితాలను విడుదల చేసేందుకు ఇంటర్ బోర్డు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే జవాబు పత్రాల వాల్యుయేషన్, స్కానింగ్ ప్రక్రియలు విజయవంతంగా పూర్తయ్యాయి.
రాష్ట్రవ్యాప్తంగా మే 12వ తేదీ నుండి 21వ తేదీ వరకు ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు మొత్తం 3,98,358 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఎంసెట్ కౌన్సెలింగ్, డిగ్రీ, ఇతర ఉన్నత విద్యా కోర్సుల అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో, విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు అధికారులు వీలైనంత త్వరగా ఫలితాలను విడుదల చేయడానికి కసరత్తు ముమ్మరం చేశారు.
Read also: CM Revanth To Visit Palamuru : రేపు పాలమూరులో సీఎం రేవంత్ పర్యటన
Inter Advanced Supplementary Results by 10th of this month
TG Inter Supply Results 2026: గురువారమే లాసెట్, పీజీఎల్‌సెట్ ఫలితాలు
మరోవైపు, తెలంగాణ లాసెట్ (LAWCET), పీజీఎల్‌సెట్ (PGLCET) ఫలితాల విడుదలకు కూడా ముహూర్తం ఖరారైంది. ఈ పరీక్షల ఫలితాలను గురువారం విడుదల చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. గత నెల 18న నిర్వహించిన ఈ ప్రవేశ పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 66,864 మంది అభ్యర్థులు రిజిస్టర్ చేసుకోగా, వారిలో 54,374 మంది పరీక్షకు హాజరయ్యారు. అభ్యర్థులు రేపు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ ద్వారా చూసుకోవచ్చు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read also:

