CM Revanth : తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఈనెల 4, 5 తేదీల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో విస్తృతంగా పర్యటించనున్నారు.
పర్యటనలో భాగంగా తొలిరోజు (జూన్ 4న) ఆయన కోయిల్ సాగర్, ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్, గూడెందొడ్డి మరియు నార్లాపూర్ రిజర్వాయర్లను సందర్శించనున్నారు. ఈ సందర్భంగా ఆయా ప్రాజెక్టుల పరిధిలో జరుగుతున్న పనుల పురోగతి, భూసేకరణ సవాళ్లు, పునరావాస ప్రక్రియలపై అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాలు నిర్వహిస్తారు. కరువు పీడిత పాలమూరు ప్రాంతాన్ని సుభిక్షం చేసేందుకు ఈ ప్రాజెక్టులను “మిషన్ మోడ్” లో పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే కర్ణాటకకు చెందిన నీటిపారుదల శాఖ మంత్రి బోస్ రాజు, తెలంగాణ సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి భీమా నది పరివాహక ప్రాంతాల్లో ప్రతిపాదిత బారేజీల స్థలాలను కూడా పరిశీలించనున్నారు.
Read Also : పవన్ కంటే తనకే ఎక్కువ అర్హత ఉందంటున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే !!
TG CMరెండో రోజు పాలమూరు-రంగారెడ్డి పనుల పరిశీలన.. కార్యాలయ ప్రారంభోత్సవం
పర్యటనలో భాగంగా రెండో రోజు (జూన్ 5న) ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మక పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (PRLIS) పనులపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. సోమశిల పరిసర ప్రాంతాలు, కల్వకుర్తి ఎత్తిపోతల పనులు, కుమ్మెర గ్రామంలోని పంప్ హౌస్ నిర్మాణం, ఉదండాపూర్ రిజర్వాయర్ పనులను ఆయన స్వయంగా క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలిస్తారు. అలాగే, ఉయ్యాలవాడలో నూతనంగా నిర్మించిన ఇరిగేషన్ సమీకృత కార్యాలయాన్ని (Integrated Irrigation Office) సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. దశాబ్దాలుగా నలుగుతున్న పాలమూరు నీటి గోసను తీర్చేందుకు నిధుల కొరత రాకుండా చూస్తామని, మిగిలిపోయిన పనులన్నింటినీ యుద్ధప్రతిపాదికన పూర్తి చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న ఈ రెండ్రోజుల పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

