Irumudi : మాస్ మహారాజా రవితేజ, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ 'ఇరుముడి' ప్రమోషన్స్ స్పీడు పెంచాయి.
ఈ సినిమా ట్రైలర్‌ను ఈ నెల 12న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ప్రముఖ శ్రీ విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్/SRKR ఇంజనీరింగ్ కాలేజ్ ప్రాంగణంలో అత్యంత వైభవంగా నిర్వహించే గ్రాండ్ ఈవెంట్‌లో ఈ ట్రైలర్‌ను లాంచ్ చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందడమే కాకుండా సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి.
Katru Katru Irumudi Kattu Songభారీ అంచనాల నడుమ ఆగస్టు 21న గ్రాండ్ రిలీజ్
రవితేజ మార్క్ మాస్ ఎలిమెంట్స్‌తో పాటు శివ నిర్వాణ మార్క్ ఎమోషన్స్ కలబోతగా వస్తున్న ఈ చిత్రానికి యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఆయన అందించిన పాటలు ఇప్పటికే చార్ట్‌బస్టర్‌గా నిలిచి, అభిమానుల్లో ట్రైలర్ పట్ల మరింత ఆసక్తిని పెంచాయి. ఈ డిఫరెంట్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌ను అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ నెల 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఘనంగా విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

