Pooja Hegde : స్టార్ హీరోయిన్ పూజా హెగ్దే సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా, తన అభిమానులతో సోషల్ మీడియా ద్వారా ఎప్పుడూ టచ్‌లోనే ఉంటుంది. కొత్త ఫోటోలు, ట్రావెల్ మూమెంట్స్, షూటింగ్ అప్డేట్స్‌ను తరచూ పంచుకుంటూ ఫాలోవర్స్‌ను అలరిస్తుంటుంది.
అందుకే ఆమెకు సినిమాల (Pooja Hegde ) ద్వారా వచ్చిన అభిమానుల కంటే సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ మరింత ఎక్కువగా ఉందని చెప్పినా అతిశయోక్తి కాదు.
విదేశీ పర్యటనలో భాగంగా బుడా ఫెస్ట్ కేఫ్‌లో :
ప్రస్తుతం పూజా హెగ్దే హిందీ, తెలుగు, తమిళ్ భాషల్లో వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఒకవైపు బాలీవుడ్ ప్రాజెక్టులు చేస్తూనే, మరోవైపు దక్షిణాది చిత్రాలపై కూడా పూర్తి దృష్టి పెట్టింది. ముఖ్యంగా ఇటీవల తెలుగులో ఆమె కెరీర్ మళ్లీ ఊపందుకోవడం అభిమానులను ఆనందపరుస్తోంది. కొత్త అవకాశాలు వరుసగా వస్తుండటంతో పూజా మరోసారి టాలీవుడ్‌లో తన సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది.

ఇదిలా ఉంటే, తాజాగా విదేశీ పర్యటనలో భాగంగా బుడా ఫెస్ట్ కేఫ్‌లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను పూజా తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసింది. ఫారిన్ వీధుల్లో రిలాక్స్ అవుతూ కనిపించిన ఆమె, స్టైలిష్ లుక్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా పొట్టి షార్ట్‌లో క్యాజువల్ అండ్ ట్రెండీ స్టైల్‌లో కనిపిస్తూ గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. ఆమె సింపుల్ స్టైల్, నేచురల్ స్మైల్ అభిమానులను మరింత ఆకట్టుకుంటున్నాయి.
ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అభిమానులతో పాటు సినీ ప్రేమికులు కూడా పూజా లుక్‌ను ప్రశంసిస్తూ కామెంట్లు చేస్తున్నారు. “ఎప్పటిలాగే స్టన్నింగ్”, “గ్లామర్ క్వీన్”, “ట్రావెల్ మోడ్‌లో కూడా సూపర్ స్టైలిష్” అంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు. సినిమాల పరంగా ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ, వ్యక్తిగత జీవితంలోని అందమైన క్షణాలను అభిమానులతో పంచుకుంటూ సోషల్ మీడియాలో తన క్రేజ్‌ను పూజా హెగ్దే మరింత పెంచుకుంటోంది.

