Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఈనెల 15 నుంచి ఈఏపీసెట్ కౌన్సెలింగ్

ఈనెల 15 నుంచి ఈఏపీసెట్ కౌన్సెలింగ్

వార్త 2 weeks ago

AP EAPCET 2026: ఏపీ ఈఏపీసెట్ 2026 కౌన్సెలింగ్ ఈ నెల 15 నుండి ప్రారంభించే అవకాశం ఉంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

రిజిస్ట్రేషన్ సమయంలో హాల్ టికెట్ నంబర్, ర్యాంక్ వివరాలను నమోదు చేసి ఫీజు చెల్లించాలి. కౌన్సెలింగ్ మొత్తం ప్రక్రియ ఆన్లైన్ లో జరుగుతుంది, కాబట్టి విద్యార్థులు వెబ్ ఆప్షన్ల ఎంపికలో జాగ్రత్తగా ఉండాలి. కళాశాలల గుర్తింపు ప్రక్రియ పూర్తయ్యాక అధికారికంగా తేదీలను వెబ్సైట్ లో చూపిస్తారు.

Read also: Bandla Ganesh: బండ్ల గణేశ్‌ కుమార్తె వెడ్డింగ్ కార్డ్‌పై సీఎం చంద్రబాబు దంపతుల పేర్లు.. నెట్టింట వైరల్!

 AP EAPCET 2026 counselling schedule

పెరిగిన ఇంజనీరింగ్ కళాశాలల ఫీజులు

రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలల్లో కనీస ఫీజును 40 వేల నుండి 47 వేల వరకు పెంచారు. దాదాపు 140 కళాశాలల్లో ఈ కొత్త ఫీజులు వర్తిస్తాయి. ఆంధ్రప్రదేశ్ ఫీజుల నియంత్రణ పర్యవేక్షణ కమిటీ కళాశాలల ఆదాయాన్ని బట్టి వచ్చే రెండు మూడు నెలల్లో మరిన్ని మార్పులు చేయనుంది. ఈ ఫీజులు 2026-27 విద్యా సంవత్సరం నుండి రాబోయే మూడేళ్ల పాటు అమల్లో ఉంటాయి. విద్యార్థులు అడ్మిషన్ తీసుకునే ముందు ఈ ఫీజు వివరాలను సరిచూసుకోవాలి.

AP EAPCET 2026: సిద్ధం చేసుకోవాల్సిన ముఖ్యమైన పత్రాలు

కౌన్సెలింగ్ కోసం అభ్యర్థులు హాల్ టికెట్, ర్యాంక్ కార్డ్, పదో తరగతి మెమో, ఇంటర్మీడియట్ మార్క్స్ మెమోలను సిద్ధం చేసుకోవాలి. ఆరో తరగతి నుండి ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికెట్లు, ఆదాయ ధ్రువీకరణ పత్రం, కుల ధ్రువీకరణ పత్రం తప్పనిసరి. వీటితో పాటు EWS సర్టిఫికెట్, టీసీ (TC), ఆధార్ కార్డు కూడా దగ్గర ఉంచుకోవాలి. పత్రాలన్నీ ఒరిజినల్స్‌తో పాటు రెండు సెట్ల జిరాక్స్‌ కాపీలను కూడా సిద్ధం చేసుకోవడం ఉత్తమం.

Epaper: epaper.vaartha.com

లారీని ఢీకొట్టిన సూపర్ లగ్జరీ బస్సు.. డ్రైవర్‌తో సహా ఇద్దరు మృతి!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha