Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఈనెలాఖరుకే ఉచిత ఇళ్ల కేటాయింపు ప్రక్రియ!

ఈనెలాఖరుకే ఉచిత ఇళ్ల కేటాయింపు ప్రక్రియ!

వార్త 1 day ago

Double Bedroom Houses:హైదరాబాద్ కోర్ అర్బన్ పరిధిలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఈనెలాఖరులోగా పూర్తి కావాలని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.

హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల కలెక్టర్లతో పాటు ఉన్నతాధికారులు అందరూ పాల్గొన్న ఈ సమీక్షా సమావేశంలో ఇందిరమ్మ టవర్లు అలాగే డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపులపై కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది. పేద ప్రజలకు ఎటువంటి సిఫార్సులు లేకుండా పూర్తిగా పారదర్శకమైన విధానంలో ఇళ్ల కేటాయింపులు జరగాలని ప్రభుత్వం భావిస్తోంది. గత ప్రభుత్వం పూర్తి చేయకుండా వదిలేసిన ఇళ్లతో పాటు కొత్తగా నిర్మించే ఇళ్లను కూడా అర్హులైన పేద కుటుంబాలకు త్వరగా అందించాలని అధికారులు నిర్ణయించారు.

Ponnam Prabhakar: ఇళ్ల కేటాయింపులో పేదలకే మొదటి ప్రాధాన్యం

 House keys by the time the next Bathukamma arrives

ఈనెలాఖరుకే లబ్ధిదారుల లాటరీ.. పూర్తి వివరాలు ఇవే!

లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో ఎటువంటి అక్రమాలకు తావులేకుండా హౌసింగ్ కార్పొరేషన్ ప్రత్యేకంగా తయారు చేసిన అత్యాధునిక సాఫ్ట్‌వేర్ ను ఉపయోగించాలని మంత్రి సూచించారు. ఈ సాఫ్ట్‌వేర్‌లో దరఖాస్తుదారుల వివరాలు అన్నీ నమోదు చేసి ఆన్‌లైన్ విధానంలో పద్ధతి ప్రకారం డ్రా నిర్వహించడం జరుగుతుంది. ఈ లాటరీ ప్రక్రియను ప్రజలు అందరూ చూసేలా ప్రత్యక్ష ప్రసారం చేయడంతో పాటు ఎప్పుడైనా వీక్షించే వెసులుబాటు కోసం యూట్యూబ్‌లో కూడా అందుబాటులో ఉంచనున్నారు. క్యూర్ పరిధిలో మొత్తం మూడు విడతల్లో లక్ష ఇందిరమ్మ ఫ్లాట్లు నిర్మించి అర్హులైన నిరుపేద కుటుంబాలకు శాశ్వత గృహవసతి కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

Double Bedroom Houses:రాబోయే బతుకమ్మ పండుగ నాటికి ఇళ్ల పంపిణీ

ఇందిరమ్మ టవర్ల నిర్మాణం కోసం మొదటి విడతలో మిగిలిన నియోజకవర్గాలతో పాటు రెండు మూడు విడతల కోసం అవసరమైన స్థలాలను వేగంగా గుర్తించాలని అధికారులను ఆదేశించారు. పేద ప్రజలు నివసించే ప్రాంతాలకు అందుబాటులో ఉండే విధంగా స్థలాల ఎంపిక జరగాలని స్పష్టం చేశారు. ప్రతి అపార్ట్‌మెంట్‌కు సంబంధించిన భూమిలో వాటాను సైతం రిజిస్ట్రేషన్‌లో పొందుపరుస్తామని తెలిపారు. వచ్చే ఏడాది బతుకమ్మ పండుగ నాటికి తొలి విడత ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు తాళాలు అందించడమే లక్ష్యమని వెల్లడించారు. తొలి విడతలో అవకాశం రాని వారు నిరుత్సాహపడకుండా తదుపరి విడతల్లో కొత్త దరఖాస్తుదారులకు కూడా అవకాశం కల్పిస్తామని స్పష్టం చేశారు.

Epaper: epaper.vaartha.com

మూడు విడతల్లో లక్ష ఇందిరమ్మ ఫ్లాట్లు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha