Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఈపీఎఫ్‌వో కొత్త నిర్ణయం.. రిటైర్మెంట్ రోజే పీఎఫ్ సెటిల్‌మెంట్

ఈపీఎఫ్‌వో కొత్త నిర్ణయం.. రిటైర్మెంట్ రోజే పీఎఫ్ సెటిల్‌మెంట్

వార్త 1 week ago

EPFO New Rules: ఉద్యోగ విరమణ చేసిన తర్వాత పీఎఫ్ (PF) డబ్బుల కోసం నెలల తరబడి చూడాల్సిన అవసరం ఇక నుంచి ఉండదు. ఈపీఎఫ్‌వో (EPFO) తన వ్యవస్థలో కొత్త మార్పులు చేస్తూ, రిటైర్మెంట్ రోజే నేరుగా నిధులు బ్యాంక్ ఖాతాలో జమయ్యేలా 'పూర్తి ఆటోమేటెడ్ సెటిల్‌మెంట్' విధానాన్ని ప్రవేశపెట్టనుంది.

ప్రస్తుతం పీఎఫ్ సెటిల్‌మెంట్ విధానం లో క్లెయిమ్‌ల తిరస్కరణ, తీవ్రమైన ఆలస్యం ప్రధాన సమస్యలుగా ఉన్నాయి. వీటిని పరిష్కరించేందుకు ఈపీఎఫ్‌వో ఒక అత్యాధునిక కొత్త సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ సాఫ్ట్‌వేర్ వల్ల మానవ ప్రమేయం తగ్గి, ప్రక్రియ వేగవంతం అవుతుంది.

Read Also : NEET-UG 2026: ఒక్కో పేపర్‌కు రూ. 5 లక్షల డీల్.. సికార్ కోచింగ్ సెంటర్లే టార్గెట్!

 EPFO’s new decision.. PF settlement on the day of retirement

EPFO New Rules: ఆటోమేటెడ్ విధానం

గతంలో లాగా ఉద్యోగులు విడిగా క్లెయిమ్ ఫారాలను సమర్పించి, వాటి ఆమోదం కోసం ఎదురుచూడాల్సిన పనిలేదు. సిస్టమ్ తన వద్ద ఉన్న డేటా ఆధారంగా ఉద్యోగి వివరాలను స్వయంగా ధృవీకరిస్తుంది. ఉద్యోగి అధికారికంగా రిటైర్ అయ్యే రోజున ఆటోమేటిక్‌గా సెటిల్‌మెంట్ పూర్తి చేసి, డబ్బును నేరుగా వారి బ్యాంక్ ఖాతాకు పంపిస్తుంది.

ఈ కొత్త విధానం అమలులోకి వస్తే, దాదాపు 6 కోట్ల మందికి పైగా ఉన్న చందాదారులకు భారీ ప్రయోజనం కలగనుంది. ముఖ్యంగా క్లెయిమ్ సెటిల్‌మెంట్‌లో ఉన్న సాంకేతిక ఇబ్బందులు తొలగిపోతాయి. డాక్యుమెంట్ల వెరిఫికేషన్ పేరుతో జరిగే ఆలస్యానికి దీని ద్వారా స్వస్తి పలకవచ్చు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

పాఠశాలల్లో ఉదయం పూట వందేమాతరం ఆలపించడం తప్పనిసరి: బెంగాల్ ప్రభుత్వం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha