Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఈరోజైన KKR విజయం సాధిస్తుందా ?

ఈరోజైన KKR విజయం సాధిస్తుందా ?

వార్త 2 months ago

పీఎల్ సీజన్‌లో భాగంగా నేడు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో కోల్కతా నైట్‌రైడర్స్ తలపడనుంది. ఈ సీజన్ KKRకు ఏమాత్రం కలిసిరావడం లేదు.

ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ (ఒకటి వర్షం వల్ల రద్దు కాగా, మిగిలిన మూడు మ్యాచుల్లో) ఘోర పరాజయాలను మూటగట్టుకుంది. పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న కోల్కతా, నేటి మ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధించి ఖాతా తెరవాలని పట్టుదలతో ఉంది. స్టార్ ప్లేయర్లు ఉన్నప్పటికీ సమష్టిగా రాణించలేకపోవడం ఆ జట్టుకు పెద్ద మైనస్‌గా మారింది.

Read Also : KTR-Tejasvi Surya: తేజస్వి సూర్య వెంటనే క్షమాపణ చెప్పాలి.. కేటీఆర్

జోరు మీదున్న గుజరాత్ టైటాన్స్.. ఫామ్‌లో స్టార్ ఆటగాళ్లు

మరోవైపు హోమ్ గ్రౌండ్‌లో ఆడుతున్న గుజరాత్ టైటాన్స్ ప్రస్తుతం మంచి ఊపులో ఉంది. సీజన్ ప్రారంభంలో మొదటి రెండు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైనప్పటికీ, ఆ తర్వాత అద్భుతంగా పుంజుకుని వరుసగా రెండు విజయాలను నమోదు చేసింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నిలకడగా రాణిస్తుండగా, జోస్ బట్లర్ తనదైన శైలిలో మెరుపులు మెరిపిస్తున్నాడు. బౌలింగ్‌లో రషీద్ ఖాన్ మ్యాజిక్, ప్రసిద్ధ కృష్ణ వేగం జట్టుకు కొండంత బలాన్ని ఇస్తున్నాయి. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో కనిపిస్తున్న జీటీ, ఇదే జోరును కొనసాగించి పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మరింత మెరుగుపరుచుకోవాలని చూస్తోంది.

గెలుపు ఎవరిది? తుది పోరుపై ఉత్కంఠ

నేటి మ్యాచ్‌లో టాస్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. కోల్కతా జట్టులో మార్పులు జరుగుతాయా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా మిడిల్ ఆర్డర్ వైఫల్యం KKRను కలవరపెడుతోంది. గుజరాత్ బౌలింగ్ అటాక్‌ను ఎదుర్కోవాలంటే కోల్కతా బ్యాటర్లు అసాధారణంగా ఆడాల్సి ఉంటుంది. ఒకవైపు వరుస ఓటములతో కుంగిపోయిన కోల్కతా, మరోవైపు వరుస విజయాలతో దూసుకుపోతున్న గుజరాత్.. ఈ రెండు జట్ల మధ్య జరిగే పోరులో పైచేయి ఎవరిదనేది వేచి చూడాలి. అభిమానులు మాత్రం ఇవాళైనా కోల్కతా బోణీ కొట్టాలని ఆశిస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

హైదరాబాద్‌లో ల్యాండ్ అయిన ధోని..మ్యాచ్‌ ఆడతారా?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha