Dailyhunt
తేజస్వి సూర్య వెంటనే క్షమాపణ చెప్పాలి.. కేటీఆర్

తేజస్వి సూర్య వెంటనే క్షమాపణ చెప్పాలి.. కేటీఆర్

వార్త 6 days ago

KTR-Tejasvi Surya: : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై పార్లమెంట్ వేదికగా బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. తెలంగాణ ఏర్పాటును భారత్-పాకిస్థాన్ విభజనతో పోల్చడంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

బీజేపీకి తెలంగాణ అస్తిత్వంపై గౌరవం లేదని ఆయన మండిపడ్డారు.

Read Also: Chinnakodur: నీలిరంగులో మిషన్ భగీరథ నీరు.. ఆందోళనలో చిన్నకోడూరు మండల ప్రజలు!

KTR-Tejasvi Surya: దేశ విభజనతో పోల్చడం మూర్ఖత్వం – కేటీఆర్

తెలంగాణ ఏర్పాటును ఒక విషాదకర సంఘటనగా చిత్రీకరించడంపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.తెలంగాణ రాష్ట్రం ఎవరి భిక్ష వల్లనో ఏర్పడలేదని, వేలాది మంది యువకుల బలిదానాలు, దశాబ్దాల పోరాటం వల్ల సిద్ధించిందని గుర్తు చేశారు.ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన రాష్ట్ర ఏర్పాటును దేశ విభజనతో పోల్చడం అత్యంత మూర్ఖత్వమని, ఇది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని విమర్శించారు.ప్రధాని మోదీ నుంచి తేజస్వి సూర్య వరకు బీజేపీ నేతలంతా తెలంగాణపై విషం కక్కుతున్నారని కేటీఆర్ ఆరోపించారు.

 KTR Slams Tejasvi Surya Telangana Remarks

పార్లమెంటు సాక్షిగా తోటి ఎంపీ తెలంగాణపై విషం చిమ్ముతున్నా, అక్కడే ఉన్న ఎనిమిది మంది తెలంగాణ బీజేపీ ఎంపీలు మౌనంగా ఉండటం అత్యంత సిగ్గుచేటని కేటీఆర్ దుయ్యబట్టారు. కనీసం తెలంగాణ నుంచి ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ ఎంపీలు సైతం బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలను ఖండించకుండా మౌనంగా ఉండడం దారుణం అన్నారు. తమ కళ్ల ముందే తెలంగాణను అవమానిస్తున్నా అడ్డుకోలేకపోయిన వీరు, ప్రజలకు ఏ ముఖం పెట్టుకుని సమాధానం చెబుతారని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని భావిస్తున్న ఈ ఎంపీల వైఖరిని తెలంగాణ సమాజం గమనిస్తోందన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

డీలిమిటేషన్ అప్‌డేట్.. దక్షిణాది రాష్ట్రాల లోక్‌సభ సీట్లు ఇవే!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha