KKR vs GT: ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా నేడు (మే 16) కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా గుజరాత్ టైటాన్స్ (GT), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మధ్య చావో రేవో మ్యాచ్ జరగనుంది.
ఈ మ్యాచ్‌లో గుజరాత్ గెలిస్తే 18 పాయింట్లతో నేరుగా ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది. కేకేఆర్ ఓడితే మాత్రం టోర్నమెంట్ నుంచి నిష్క్రమించాల్సి వస్తుంది. కేకేఆర్ ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌లలో 4 గెలిచి, 6 ఓడగా, ఒకటి రద్దయింది. ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే మిగిలిన 3 మ్యాచ్‌లలోనూ తప్పక గెలవాలి. అలాగే ఇతర జట్ల ఫలితాలపై కూడా కేకేఆర్ ఆధారపడాల్సి ఉంటుంది.
Read Also:SRH vs RCB: హాట్ కేకుల్లా అమ్ముడైపోయిన ఎస్‌ఆర్‌హెచ్ vs ఆర్సీబీ టికెట్లు
KKR vs GT IPL 2026 Playoff Scenarios
KKR vs GT: గుజరాత్ టైటాన్స్: గెలిస్తే నేరుగా ప్లేఆఫ్స్‌కు!
ఒక్క మ్యాచ్ రద్దు అయింది. ఈ క్రమంలో ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే మిగతా మూడు మ్యాచ్ లలో కేకేఆర్ గెలవాలి. అదే సమయంలో ఇతర టీమ్స్ గెలుపోటములపైన కేకేఆర్ ఆధార పడాల్సి వస్తుంది. దీంతో ఎలాగైనా గెలవాలన్న కసితో కేకేఆర్ ప్లేయర్లు బరిలో దిగుతున్నారు. అటు బలమైన ఓపెనర్లు, సత్తా ఉన్న ఫాస్ట్ బౌలర్లతో గుజరాత్ కూడా ఏ మాత్రం తక్కువేం లేదు. ఈడెన్ గార్డెన్స్ వేదిక అయినప్పటికీ గుజరాత్ టైటాన్స్ బలంగా కనిపిస్తోంది. మరి ఈ మ్యాచ్ లో పంజా ఎవరు విసురుతారో చూడాలి.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

